Airbus: ఫ్లయిట్ డేటాపై సోలార్ రేడియేషన్ ప్రభావం.. 250 ఎయిర్‌బస్ విమానాల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
Airbus: ఎయిర్ బస్ కంపెనీకి చెందిన సుమారు 250 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయనున్నారు. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వద్ద విమాన రాకపోకలకు ఆలస్యం జరగనున్నది. సోలార్ రేడియేషన్ వల్ల ఫ్లయిట్ కంట్రోల్ డేటా దెబ్బతినే అవకాశం ఉందని, దాని కోసం సాఫ్ట్‌వేర్‌ను మార్చుతున్నట్లు ఎయిర్‌బస్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎయిర్‌బస్(Airbus) విమానాల సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీకి చెందిన ఏ320 మోడల్ విమానాలపై సోలార్ రేడియేషన్ ప్రభావం పడనున్నట్లు చెప్పింది. ఆ మోడల్‌కు చెందిన సుమారు 250 విమానాలు ఆ ప్రభావానికి లోనుకానున్నాయి. ఆ విమానాల్లోని ఫ్లయిట్ డేటా కంట్రోల్‌పై సోలార్ రేడియేషన్ ప్రభావం ఉంటుందని ఎయిర్‌బస్ సంస్థ ప్రకటించింది. ఫ్లయిట్ కంట్రోల్‌కు అవసరమైన సంక్లిష్టమైన డేటా.. తీవ్రమైన సూర్య కిరణాల వల్ల కరప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఎయిర్‌బస్ చెప్పింది. అయితే ఏ320 మోడల్లో ఉన్న సుమారు 250 విమానాల్లో సాఫ్ట్వేర్ మార్పులు చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొన్నది. దీని వల్ల ఆపరేషనల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఎయిర్‌బస్ కంపెనీ చెప్పింది. భారత్‌లో వివిధ సంస్థల వద్ద ఉన్న ఎయిర్‌బస్ విమానాల్లో సాఫ్ట్వేర్ చేయాల్సి ఉందని ఆ కంపెనీ తెలిపింది.
ఏ320 కుటుంబానికి చెందిన విమానాలు ఇండియా వద్ద చాలా ఉన్నాయి. భారత్‌లో విమానయాన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ఏ320కి చెందినవే ఉన్నాయి. భారత్‌లో డొమెస్టిక్ సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని కంపెనీల వద్ద సుమారు 560 ఏ320 విమానాలు ఉన్నట్లు ఎయిర్‌బస్ సంస్థ వెల్లడించింది. ఇటీవల ఏ320 విమానాన్ని విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌బస్ కంపెనీ చెప్పింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే ప్రక్రియలో విమానాల ఆపరేషన్ నిర్వహణలో కొంత జాప్యం జరుగుతుందని, దాని వల్ల ప్రయాణికులకు, కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఎయిర్‌బస్ పేర్కొన్నది.
సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ మార్పుల్లో భాగంగా ఆ విమానాల్లో ఎలివేటర్ ఐలిరాన్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. యురోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్ట్ ఏజెన్సీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ విమానాల్లో ఈఎల్ఏసీని ఏర్పాటు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల విమానాల రాకపోకల్లో ఆలస్యం ఉంటుందని, ప్రయాణికులు దీన్ని గమనించాలని ఎయిర్ ఇండియా సంస్థ తన ట్వీట్లో తెలిపింది.
We are aware of a directive from Airbus related to its A320 family aircraft currently in-service across airline operators. This will result in a software/hardware realignment on a part of our fleet, leading to longer turnaround time and delays to our…
— Air India (@airindia) November 28, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

