Aamir Khan | ప్రేక్షకులు పాఠాలు నేర్చుకోవడానికి రావడం లేదు.. ఆమిర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలో తన ప్రత్యేక దృష్టితో, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమానికి ఆమిర్ ఖాన్ హాజరయ్యారు
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలో తన ప్రత్యేక దృష్టితో, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమానికి ఆమిర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ తన స్టార్డమ్, తన సినిమాల ఎంపిక, తన సినీ ప్రయాణంలో తీసుకున్న రిస్కుల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. “నేను స్టార్ ఎలా అయ్యానో నాకే తెలియదు. ఎందుకంటే నేను స్టార్డమ్కు సంబంధించిన నియమాలను చాలా సందర్భాల్లో ఉల్లంఘించాను. ‘లగాన్’, ‘సర్ఫరోష్’, ‘తారే జమీన్ పర్’ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేశాను. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది చేసేటప్పుడే తెలియదు” అని అన్నారు.
సామాజిక అంశాలు ఉన్న సినిమాలు చేయడం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. సామాజిక అంశాలతో సినిమాలు చేయడం నా అలవాటు కాదు. అలా చేయడానికి నేనేమి కార్యకర్తను కాదు. నాకు కథలు చెప్పడం అంటే ఇష్టం. నేను చేసే చిత్రాల్లో ఏదైనా ఒక సందేశం ఉన్నా అది యాదృచ్ఛికమే. ప్రేక్షకులు పాఠాలు నేర్చుకోవడానికి థియేటర్‌కు రారు, వినోదం కోసం వస్తారు అని అన్నారు. ప్రేక్షకులను అలరించడం నా బాధ్యత, తన ప్రాథమిక లక్ష్యం వినోదం పంచడమేనని తెలిపారు. నా బాధ్యత ప్రజలను అలరించడం, నవ్వించడం, భావోద్వేగపరచడం. అన్ని రకాల జానర్లలో నటించగలనని ఎప్పుడూ నమ్ముతాను. ట్రెండ్ చూసి సినిమాలు చేయడమనే అలవాటు నాకు లేదు అని పేర్కొన్నారు.
సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమా గజిని గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘గజిని’ సినిమాను చాలామంది చేయొద్దని చెప్పారు. కానీ నాకు కథ నచ్చింది, అందుకే చేశాను. ట్రెండ్ కాదు, కథే నా నిర్ణయం. చిన్నప్పటి నుంచే కథలంటే మక్కువ . అదే తనను సినీ పరిశ్రమలో విజయవంతం అయ్యేలా చేసిందని ఆమిర్ అన్నారు. సినిమా అంటే కథ, కథ అంటే భావోద్వేగం. నేను అందులో ఆనందాన్ని కనుగొంటాను అంటూ IFFI వేదికపై చేసిన ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ వర్గాలు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఆయన నిజాయితీతో మాట్లాడిన మాటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aamir Khan
- audience
- bollywood
- iifi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

