e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News పిల్ల‌లు పుట్టాక నేను జాబ్ మానేసినా స‌మ‌స్య‌లు రావ‌ద్దంటే ఏం చేయాలి?

పిల్ల‌లు పుట్టాక నేను జాబ్ మానేసినా స‌మ‌స్య‌లు రావ‌ద్దంటే ఏం చేయాలి?

నేను, నా భర్త ఒకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. మాకు పెండ్లయి రెండేండ్లు అవుతున్నది. ఇన్నిరోజుల సంపాదనను ఫర్నిచర్‌, కారు కొనడానికే ఖర్చు చేశాం. ఇంకో ఏడాది తర్వాతే పిల్లల ఆలోచన. ఈలోపు వీలైనంత పొదుపు చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతం ఇద్దరికీ కలిపి లక్షన్నర చేతికి వస్తుంది. ఖర్చులన్నీ పోనూ కనీసం యాభైవేలు మిగులుతాయి. పిల్లలు పుట్టాక నేను ఉద్యోగానికి బ్రేక్‌ ఇచ్చినా లేదా మానేసినా సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ లోటును పూడ్చడానికి డబ్బు ఎలా ఆదా చేయాలో చెప్పండి?

– ఓ సోదరి

- Advertisement -

జ: పిల్లల భవిష్యత్‌ కోసం ఆదా చేయాలనుకోవడం మంచి ఆలోచనే. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం అన్నది దీర్ఘకాలిక లక్ష్యం కిందికి వస్తుంది. పిల్లలు కోరుకున్న విద్యను అందించడం పెద్దల బాధ్యత కూడా. వాళ్లకు 18 ఏండ్లు వచ్చేసరికి సొమ్ము చేతికి అందేలా ప్లాన్‌ చేసుకోవాలి. కనీసం 20 ఏండ్ల సమయం పెట్టుకుంటే, నెలవారీగా కొంత ఆదా చేయొచ్చు. మిడ్‌క్యాప్‌ ఫండ్‌లాంటి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా నెలకు రూ.6,000 మదుపు చేయవచ్చు. దీనివల్ల 20 ఏండ్ల తర్వాత పిల్లల ఉన్నత చదువులకు ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. ఒక్క బిడ్డ చాలని అనుకునే వాళ్లకు ఇది సరిపోతుంది. ఇద్దరు పిల్లల్ని ప్లాన్‌ చేసుకోవాలనుకుంటే, నెలకు రూ.12,000 ఆదా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌ వచ్చే పరిస్థితులు ఎటూ లేవు కాబట్టి, రిటైర్మెంట్‌ కార్పస్‌కు నెలకు రూ.8,000 సిప్‌ తీసుకోవడం ఉత్తమం. ఇలా నెలకు రూ.20,000 ఆదా చేయగలిగితే
భవిష్యత్‌లో పిల్లల చదువులకు, రిటైర్మెంట్‌ జీవితానికి ఇబ్బంది ఉండదు. రానున్న రోజుల్లో మీరు ఉద్యోగం మానేసినా, మీ భర్త జీతంతో ఈ ప్రణాళికను కొనసాగించాలి. అయితే ఏదిచేసినా బాగా ఆలోచించి, అన్నీ కనుక్కొని ముందడుగు వేయాలి. దీంతోపాటు మరో రూ.30,000 నెలనెలా రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకుంటే, అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

– దీప నిట్టల, చార్టర్డ్‌ వెల్త్‌ మేనేజర్‌, డైరెక్టర్‌, శ్రీమంత్రణ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇంట్లో ఉండాలని లేదు.. హాస్టల్‌లో చేరతానంటే ఒప్పుకోవట్లేదు.. 16 ఏండ్ల అమ్మాయి ఆవేద‌న‌

నా పేరు మీద ఉన్న ఆస్తిపై నా భర్తకు హక్కుఉంటుందా?

నా వయసు ఇరవై ఆరు. అప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు..

మా ఆయ‌న వివాహిత‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు.. ఆమె భ‌ర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement