Annagaru Vostaru Teaser | ఒక్క డైలాగు లేదు, యాక్షన్ సీన్స్ లేవు.. టీజర్‌తో అమాంతం పెరిగిన అంచనాలు
Annagaru Vostaru Teaser | తమిళ స్టార్ హీరో కార్తీ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘వా వాతియార్’ కి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే వినూత్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు
Annagaru Vostaru Teaser | తమిళ స్టార్ హీరో కార్తీ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘వా వాతియార్’ కి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే వినూత్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కార్తీ ఈసారి పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో కార్తీ స్టైలిష్ లుక్ మరింత హైప్ క్రియేట్ చేసింది. శుక్రవారం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఆసక్తికర విషయం ఏమిటంటే టీజర్లో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అయితే కార్తీ ఎంట్రీ, పోలీస్ ఆఫీసర్‌గా ఆయనకు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్, ప్యూర్ ఎలివేషన్ షాట్స్ ప్రేక్షకులను ఫుల్‌గా ఆకట్టుకున్నాయి.
టీజర్ మొత్తం కార్తీ క్యారెక్టర్‌పై మిస్టరీని సృష్టిస్తూ, “ఈ హీరో రోల్ ఏంటి?” అనే క్వశ్చన్‌ను ప్రేక్షకుల మనసుల్లో వదిలింది. డిఫరెంట్ ప్రెజెంటేషన్, స్టైలిష్ ట్రీట్మెంట్ చూసి ఫ్యాన్స్ “మూవీ స్టోరీ అదిరిపోతుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో కృతిశెట్టి కీలకమైన పాత్రలో కనిపించనుంది. టీజర్లో ఆమె లుక్ రివీల్ చేయకపోయినా, ఆమె పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారనుందనే సమాచారం వస్తోంది.నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సత్యరాజ్,మధుర్ మిట్టల్,ఆనంద్ రాజ్,రాజ్ కిరణ్,శిల్పా మంజునాథ్,కరుణాకరణ్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుండగా సంతోష్ నారాయణన్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే హైలైట్‌గా నిలుస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ప్రొడక్షన్ విలువలు కూడా టీజర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళ వెర్షన్ డిసెంబర్ 5న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ అదే రోజున విడుదల అవుతుందా లేదా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.స్టైలిష్ ప్రెజెంటేషన్, మాస్ ఎలిమెంట్స్, మిస్టరీతో కూడిన పోలీస్ డ్రామా కావడంతో ‘అన్నగారు వస్తారు’/‘వా వాతియార్’ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

