e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఇంట్లో ఉండాలని లేదు.. హాస్టల్‌లో చేరతానంటే ఒప్పుకోవట్లేదు.. 16 ఏండ్ల అమ్మాయి ఆవేద‌న‌

ఇంట్లో ఉండాలని లేదు.. హాస్టల్‌లో చేరతానంటే ఒప్పుకోవట్లేదు.. 16 ఏండ్ల అమ్మాయి ఆవేద‌న‌

నా వయసు పదహారు. ఇప్పటికీ మా అమ్మానాన్నలు చిన్నపిల్లల్లా గొడవ పడుతుంటారు. పదేండ్ల వయసులో నాకొక తమ్ముడు పుట్టి చనిపోయాడు. అప్పటినుంచీ వాళ్లిద్దరూ నన్ను మరింత జాగ్రత్తగా చూడాల్సింది పోయి, నేను వాళ్లిద్దర్నీ చూసుకోవాలని కోరుకుంటున్నారు. ఒక్కరోజు కూడా గొడవ పెట్టుకోకుండా ఉండరు. ప్రతి చిన్నదానికి తిట్టుకుంటారు. ఆ కోపంలో నాన్న చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోతాడు. నాకైతే ఇంట్లో ఉండాలని లేదు. హాస్టల్‌లో చేరతానంటే ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో చెప్పండి?

– ఓ సోదరి

- Advertisement -

జ: నీ వయసు ఇంకా చిన్నదే. అయినా సొంతంగా బతకగలననే నమ్మకం వచ్చింది. మీ అమ్మానాన్నలు తమ జీవితాల్లో చాలా కోల్పోయి ఉంటారు. అలాగే, నీ ముందు ఎలా ప్రవర్తిస్తున్నామనే విషయంపై వాళ్లు దృష్టి సారించలేకపోతున్నారు. సొంత నిర్ణయాలు తీసుకునేంత వయసు, అనుభవం నీకింకా రాలేదు. ఇంట్లోంచి వెళ్లిపోయి హాస్టల్‌లో ఉండాలని అనుకోవడం సరైన నిర్ణయం కాదు. నీ వయసు పిల్లలు హాస్టల్‌లో ఉంటున్న మాట నిజమే. కానీ వాళ్లంతా ఇంటిని, అమ్మానాన్నలను వదిలేసి వెళ్లట్లేదు. ఇక్కడ నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి. మీ అమ్మానాన్నల మధ్య ఒక బలమైన బంధం ఉంది. అలాగే నీతో కూడా వాళ్లిద్దరికీ ప్రగాఢ అనుబంధం ఉంది. అంతేకాదు, వాళ్ల అన్యోన్యత గురించి నీకు తెలిసింది కొంతవరకే. అంతమాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ లేదని అనుకోవద్దు. ఆ ఇరువురికే పరిమితమైన ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఎంత గొప్ప జంటలకైనా గొడవలు ఉంటాయి. ఇక్కడ నీ కోసం, నీవల్ల వాళ్లు గొడవలు పడటంలేదన్న విషయాన్ని గుర్తించాలి. దయచేసి వాళ్లను తక్కువగా భావించవద్దు. నిన్ను ప్రేమించడం లేదన్న అపోహ విడిచిపెట్టు. మరోసారి బాగా ఆలోచించు.

– సహానా రబీంద్రనాథ్‌, లైఫ్‌ కోచ్‌ అండ్‌ థెరపిస్ట్‌ SWITCH NOV
హైదరాబాద్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

అమ్మ‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.. న‌ర‌కం చూపిస్తున్నాడు.. ఏం చేయాలో చెప్పండి

మా ఆయ‌న వివాహిత‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు.. ఆమె భ‌ర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు..

నా వయసు ఇరవై ఆరు. అప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు..

ఆ టైంలో నా భ‌ర్త‌ వేరే అమ్మాయిల పేర్లు పిలుస్తుంటాడు? న‌న్నేం చేయ‌మంటారు?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement