Rajinikanth | రేర్ క్లిక్.. మూడు తరాలు ఒకే పిక్‌లో కనిపించడంతో నెట్టింట వైరల్
Rajinikanth | మెగాస్టార్ చిరంజీవి లెగసీని రామ్‌చరణ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని అభిషేక్ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. వీరికి సమకాలికుడైన కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ లెగసీని ఎవరు ముందుకు నడిపిస్తారు? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు.
Rajinikanth | మెగాస్టార్ చిరంజీవి లెగసీని రామ్‌చరణ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని అభిషేక్ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. వీరికి సమకాలికుడైన కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ లెగసీని ఎవరు ముందుకు నడిపిస్తారు? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. ఆయన కుమార్తెలు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ ఇద్దరూ దర్శకత్వం, నిర్మాణంలో అడుగుపెట్టినా నటనలో మాత్రం ఎవరూ అడుగులు వేయలేదు. అయితే రజనీకాంత్ కుటుంబంలో మూడో తరం ఆయన వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సౌందర్య, ఐశ్వర్య పిల్లలు వేగంగా ఎదుగుతూ ఉండటంతో వారిలో ఎవరో ఒకరు తలైవర్ లెగసీని ముందుకు తీసుకెళ్తారన్న ఆశ పెరుగుతోంది.
తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికగా అరుదైన క్షణం చోటుచేసుకుంది. రజనీకాంత్ కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఆ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా రజనీ కుటుంబం అంతా కలిసి పబ్లిక్‌గా కనిపించడం చాలా అరుదు. అయితే గోవాలో జరిగిన ఈ వేడుకకు రజనీకాంత్‌తో పాటు ఆయన భార్య లతా, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు , ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌందర్య రజనీకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫోటోలో రజనీకాంత్ ఎప్పటిలాగే సింపుల్ క్యాజువల్ లుక్‌లో మెరిసి, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పోజులిచ్చాడు. మూడు తరాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఫోటోకు సౌందర్య “టుగెదర్ ఎట్ @iffigoa” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక కెరీర్ విషయానికి వస్తే, రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా 2026 జూన్‌లో విడుదల కానుంది. చివరిగా రజనీకాంత్ కూలీ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ చిత్రం మోస్తరు విజయాన్ని అందుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

