Rapido Driver: ఉదయ్‌పూర్ పెళ్లికి ర్యాపిడో డ్రైవర్ ఫండింగ్.. అతని అకౌంట్‌కు 8 నెలల్లో 331 కోట్లు జమ
Rapido Driver: బెట్టింగ్ యాప్స్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే ఓ ర్యాపిడ్ డ్రైవర్ అకౌంట్లోకి 8 నెలల్లోనే 331 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. దాంట్లో ఓ కోటి ఉదయ్‌పూర్ వెడ్డింగ్‌కు వాడినట్లు తేలింది.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఓ కేసుకు చెందిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తు చేపడుతున్న ఈడీ అధికారులకు నమ్మలేని విషయాలు తెలిశాయి. 8 నెలల్లో ఓ ర్యాపిడో డ్రైవర్(Rapido Driver) అకౌంట్లోకి 331 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే ఆ డ్రైవర్ అకౌంట్ నుంచే ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ గ్రాండ్ పెళ్లికి కూడా కోటి రూపాయాలు ఖర్చు చేశారు. ఆ కేసులో కూపీలాగుతున్న ఈడీ అధికారులకు కొత్తకొత్త అంశాలు బహిర్గతమయ్యాయి. రెండు పూటల భోజనం చేయలేని ఆ ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లోకి ఎలా 331 కోట్లు వచ్చాయో ఈడీ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఆ ర్యాపిడో డ్రైవర్ అకౌంట్‌ను మ్యూల్ అకౌంట్‌గా ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమ డబ్బును హవాలా చేసేందుకు ఆ అకౌంట్ వాడారు. 1xbet ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో ఇంతవరకు ర్యాపిడో సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. డ్రైవర్ బ్యాంక్ అకౌంట్లోకి 2024, ఆగస్టు 19వ తేదీ నుంచి 2025, ఏప్రిల్ 16వ తేదీ వరకు సుమారు 331.36 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు.
వందల కోట్లు అక్రమ రీతిలో ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తం అయ్యారు. డ్రైవర్ బ్యాంక్ రికార్డుల ప్రకారం ఆ అడ్రస్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. అయితే ఆ ర్యాపిడో డ్రైవర్ ఓ రెండు గదుల ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించారు. రోజంతా బైక్‌ను బయట రైడ్‌కు వెళ్తుంటాడని తేల్చారు. అయితే డ్రైవర్ అకౌంట్లో ఉన్న 331 కోట్ల డిపాజిట్ నుంచి ఓ కోటి రూపాయాలను ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఖర్చులకు వినియోగించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా చేయడంతో ఈడీ దానిపై నజర్ వేసింది. అయితే గుజరాత్‌లోని ఓ రాజకీయవేత్తతో లింకు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ పెళ్లి గురించి కానీ, వధూవరుల గురించి కానీ తనకు ఏమీ తెలియదని ఆ డ్రైవర్ విచారణలో పేర్కొన్నాడు. అయితే మ్యూల్ ప్లాట్‌ఫామ్‌పై ఆ అకౌంట్‌ను వాడుతున్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.
భారీ మొత్తంలో ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లోకి వివిధ ప్రదేశాల నుంచి ఫండ్స్ వచ్చేవని, అయితే అంతే వేగంగా మళ్లీ అనుమానిత అకౌంట్లలోకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఈడీ అధికారులు చెప్పారు. ఆ డ్రైవర్ అకౌంట్‌కు, బెట్టింగ్ కేసుకు లింకు ఉన్నట్లు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

