Sankranti Special Fashion | సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకొనే పండుగ సంక్రాంతి. పేరంటాలైనా, బొమ్మల కొలువులైనా, భోగి పండ్ల వేడుకలైనా సంప్రదాయ దుస్తులదే హవా. అందులోనూ లంగావోణి అన్ని వయసుల వారికీ నప్పుతుంది. సంక్రాంతి లక్ష్మి కదిలివచ్చినట్టే ఉంటుంది.
నిండైన బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో చేసిన డిజైన్ ఇది. బ్లూ కలర్ నారాయణపేట పట్టు ఫ్యాబ్రిక్‌కు రెడ్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ జరీతో, నిండుగా పెద్ద బార్డర్‌తో లెహంగా డిజైన్ చేశారు. దీనికి నప్పేలా లెహంగా కలర్లోనే బ్లౌజ్ ఎంచుకొని కాలర్ నెక్ ఇచ్చారు. ట్రెండీ లుక్ కోసం షార్ట్ హ్యాండ్స్తోపాటు బ్యాక్‌సైడ్ డోరీలు ఇచ్చారు. కలంకారీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన టసల్స్ మరింత సౌందర్యాన్ని జోడించాయి. కలంకారీ దుపట్టా దీనికి అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
khada dupatta | ఒకప్పుడు మొఘల్ రాణులకే పరిమితమైన ఈ ఖాడా దుపట్టా గురించి తెలుసా
ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా మహిళలు ఇష్టపడేది చీరకట్టే.. మరి వాటిలో లేటెస్ట్ డిజైన్ ఏంటో తెలుసా
firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే
Fashion | ఒకప్పుడు లంగా ఓణీలు.. కానీ ఇప్పుడు స్కర్ట్లే ఫ్యాషన్ !!