కావలసిన పదార్థాలు: ఓట్స్: అరకప్పు, పాలు: ఒక కప్పు, కస్టర్డ్ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు, పండ్లు (అరటి, స్ట్రాబెర్రి, ఆపిల్.. వంటివి ఏవైనా): ఒక కప్పు, చక్కెర లేదా తేనె: 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్: 3 చుక్కలు
తయారీ విధానం: ముందుగా, ఒక పాత్రలో ఓట్స్ వేసి మరుగుతున్న నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని రెండు చెంచాల పాలు లేదా నీళ్లలో చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పాలు వేడిచేయాలి. మరుగుతున్న పాలలో కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి, ఉండలు కట్టకుండా కలపాలి. కొద్దిగా చిక్కబడ్డాక దింపి వెనీలా ఎసెన్స్, చక్కెర వేసి కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా చిలికి ఫ్రిజ్లో పెట్టాలి. నచ్చిన పండ్లు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, మెత్తబడిన ఓట్స్ వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత, చల్లబడిన కస్టర్డ్ వేసి.. అన్నిటినీ బాగా కలిపితే చల్లచల్లని ఓట్స్ ఫ్రూట్స్ సలాడ్ రెడీ.
ఇవి కూడా చదవండి: