చండీగఢ్: కారు దొంగిలించిన వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు పోలీసులు ఆ కారును చుట్టుముట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Thief Rams Vehicles To Escape) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని లుధియానాలో ఈ సంఘటన జరిగింది. షిమ్లాపురి ప్రాంతంలో తెల్లటి మారుతి సుజుకి బాలెనో వాహనం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సాంకేతిక ఆధారాలతో ఆ కారును ట్రేస్ చేశారు.
కాగా, ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో దొంగిలించిన ఆ కారును అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కారును ఆపాలని డ్రైవర్‌కు సంకేతం ఇచ్చారు. అయితే అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. గ్రౌండ్ సమీపంలోని ఇరుకైన వీధుల్లో నిర్లక్ష్యంగా ముందుకు, వెనుకకు కారు నడిపాడు. పారిపోయే ప్రయత్నంలో రెండు బైక్‌లు, రెండు స్కూటర్లు, ఆటో, రోడ్డు పక్కన పార్క్ చేసిన రెండు వాహనాలతో సహా సుమారు ఏడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ సందర్భంగా స్థానికులు భయాందోళన చెందారు. వీధుల్లో పరుగులు తీశారు.
మరోవైపు పోలీసులు చివరకు ఆ కారును చుట్టుముట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వాహనం చోరీలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే కారు దొంగ పారిపోయేందుకు ప్రయత్నించి పలు వాహనాలను ఢీకొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
खतरनाक वीडियो है 👇
पंजाब में कार चोर का उत्पात देखिए. लोग कार चोर को पकड़ने में लगे हैं, और कार चोर गाड़ियों और लोगों को रौंदने में लगा है.
अलग लेवल का ड्रामा है. pic.twitter.com/u1wkYO2grN
— Ranvijay Singh (@ranvijaylive) April 20, 2026
Also read:
dishonour killing | ఇంట్లో ప్రియుడితో సోదరి.. ఆమెను కొట్టి చంపిన సోదరులు
Private jet crashes | చెట్టును ఢీకొట్టి.. కొండపై కూలిన ప్రైవేట్ జెట్ విమానం
Fire At Rajasthan Refinery | ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ముందు రోజు.. రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం