లక్నో: ఒక వ్యక్తి రాత్రి వేళ తన ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ప్రియుడితో కలిసి సోదరి ఉండటాన్ని అతడు చూశాడు. మరో ఇద్దరు సోదరులను రప్పించాడు. ఆ ముగ్గురూ కలిసి సోదరిని కొట్టి చంపారు. ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. (dishonour killing) ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 16న రాత్రివేళ 19 ఏళ్ల యువతి సోదరుడు ఇంటికి చేరుకున్నాడు. ప్రియుడైన రవి కుమార్ గుప్తాతో కలిసి సోదరి ఉండటాన్ని అతడు చూశాడు. వారిద్దరిని గదిలో బంధించాడు. మిగతా ఇద్దరు సోదరులను కూడా ఇంటికి రప్పించాడు.
కాగా, ముగ్గురు సోదరులు కలిసి తమ సోదరి, ఆమె ప్రియుడ్ని ఐరన్ రాడ్లతో కొట్టారు. దెబ్బలు తాళలేక ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ప్రియుడు రవి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అయితే అతడి ఇంటికి చేరుకుని తిరిగి కొట్టారు. చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు సోదరి హత్యను కప్పిపుచ్చేందుకు ముగ్గురు సోదరులు ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం ఒక వాహనంలో ఆమె మృతదేహాన్ని తరలించారు. గోరఖ్‌పూర్‌లోని సిసై ఘాట్‌కు తీసుకువెళ్లి దహనం చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రక్తపు మరకలను శుభ్రం చేశారు. రక్తం అంటిన బట్టలను కాల్చివేశారు.
కాగా, తీవ్రంగా గాయపడిన రవిని అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతి ముగ్గురు సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరువు హత్యపై వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Private jet crashes | చెట్టును ఢీకొట్టి.. కొండపై కూలిన ప్రైవేట్ జెట్ విమానం
Fire At Rajasthan Refinery | ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ముందు రోజు.. రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
BJP MLA Threatens Cops | వాహనంతో ఐదుగురిని ఢీకొట్టిన కొడుకు.. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్