BJP MLA Threatens Cops | వాహనంతో ఐదుగురిని ఢీకొట్టిన కొడుకు.. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
BJP MLA Threatens Cops | బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనంతో ఐదుగురిని ఢీకొట్టాడు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని ఆ బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు. ‘నీ నాన్నకు దమ్ముంటే’ ఆ ప్రాంతంలో తన కుమారుడిని అడ్డుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు థార్ వాహనంతో ఐదుగురిని ఢీకొట్టాడు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారిని ఆ బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు. ‘నీ నాన్నకు దమ్ముంటే’ ఆ ప్రాంతంలో తన కుమారుడిని అడ్డుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. (BJP MLA Threatens Cops) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి ఏప్రిల్ 16న శివపురి జిల్లాలోని కరేరాలో వేగంగా థార్ వాహనం నడిపాడు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి ఆ వాహనాన్ని దూకించి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ ఐదుగురు గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, తన కుమారుడు చేసిన ఈ ప్రమాదం కేసుపై దర్యాప్తు చేస్తున్న కరేరా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీఓపీ) ఆయుష్ జాఖర్‌ను బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి బహిరంగంగా బెదిరించారు. ‘కరేరా ఎస్డీఓపీ మాటలను నేను జీర్ణించుకోలేకపోతున్నా. నా కొడుకు మళ్లీ ఇక్కడ కనిపించవద్దని ఆయన హెచ్చరించారు. నేను ఎస్డీఓపీని అడగాలనుకుంటున్నా. కరేరా మీ ‘నాన్నదా?’ సాధారణంగా నేను ఇలా అనను. కానీ ఇప్పుడు స్పష్టం చేయాలనుకుంటున్నా. నా కొడుకు కరేరాకు తిరిగి వస్తాడు. ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మీ ‘నాన్న’కు దమ్ముంటే ఆపడానికి ప్రయత్నించమను’ అని సవాల్ విసిరారు.
అంతేగాక ఆ పోలీస్ అధికారిపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని కూడా బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి హెచ్చరించారు. ‘మా చరిత్రను ఒకసారి పరిశీలించమని ఎస్డీఎపీకి నేను గుర్తు చేయాలనుకుంటున్నా. మీరు మాపై తప్పుడు ఆరోపణలు చేసినా, అనవసరమైన ఒత్తిడి తెచ్చినా, లేదా పక్షపాత విచారణ జరిపినా, మేం దానిని సహించబోం. మీకు తగిన సమాధానం తప్పకుండా ఇస్తాం. అలాంటి అధికారులకు నేను చెప్పేది ఒక్కటే, మీ పరిమితుల్లో ఉండండి, మీ అధికార పరిధిలోనే ఉండండి’ అని పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధిపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read:
Watch: థార్‌తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన
Watch: రీల్ కోసం బైక్‌పై ముగ్గురు సోదరుల విన్యాసాలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

