Man Slits Twin Daughters’ Throats | కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేసిన వ్యక్తి.. ఆ తర్వాత పోలీసులకు సమాచారం
Man Slits Twin Daughters' Throats | ఒక వ్యక్తి తన కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన కూతుర్లను చంపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని పరిశీలించారు.
లక్నో: ఒక వ్యక్తి తన కవల కుమార్తెల గొంతులు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన కూతుర్లను చంపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని పరిశీలించారు. (Man Slits Twin Daughters’ Throats) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బీహర్‌కు చెందిన 48 ఏళ్ల శశి రంజన్ మిశ్రా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ పని చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మ, కాన్పూర్‌లోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నప్పుడు శశిని కలిసింది. ఈ నేపథ్యంలో 2014 లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల వయస్సున్న కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధితో పాటు ఆరేళ్ల కుమారుడు వారికి ఉన్నారు.
కాగా, శనివారం రాత్రి భోజనం తర్వాత శశి తన ఇద్దరు కవల కుమార్తెలను నిద్రపుచ్చాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కత్తితో వారి గొంతులు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. తన ఇద్దరు కూతుళ్లను చంపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తం మడుగులో మరణించిన ఇద్దరు బాలికల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వారి తండ్రి అయిన శశిని అరెస్ట్ చేశారు.
మరోవైపు తన భర్త శశి తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడని, అందుకే తమ ఇంట్లో పలు సీసీటీవీ కెమెరాలు అమర్చాడని భార్య రేష్మ పోలీసులకు తెలిపింది. కుమార్తెల గదుల్లోకి వెళ్లడానికి తనను అనుమతించేవాడు కాదని ఆమె ఆరోపించింది.
అయితే తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు శశి అనుమానించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీంతో కుమార్తెలను తాను చూసుకుంటానని, కుమారుడితో కలిసి విడిగా నివసించాలని పలుమార్లు భార్యకు అతడు చెప్పినట్లు తెలిసిందన్నారు. అయితే కవల కుమార్తెలను అతడు ఎందుకు హత్య చేశాడు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Girl Raped by Friends | బర్త్ డే పార్టీలో.. బాలికపై నలుగురు స్నేహితులు అత్యాచారం
Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

