Watch: రీల్ కోసం బైక్‌పై ముగ్గురు సోదరుల విన్యాసాలు.. తర్వాత ఏం జరిగిందంటే?
3 Brothers Killed | సోషల్ మీడియాలో రీల్ కోసం ముగ్గురు అన్నాదమ్ములు బైక్‌పై స్టంట్లు చేశారు. వేగంగా దూసుకెళ్లడంతో నియంత్రణ కోల్పోయారు. ఒక లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: సోషల్ మీడియాలో రీల్ కోసం ముగ్గురు అన్నాదమ్ములు బైక్‌పై స్టంట్లు చేశారు. వేగంగా దూసుకెళ్లడంతో నియంత్రణ కోల్పోయారు. ఒక లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. (3 Brothers Killed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 14న బేలా గ్రామానికి చెందిన ముగ్గురు సోదరులు బైక్‌పై స్టంట్లు చేశారు. జాతీయ రహదారి 135పై వేగంగా దూసుకెళ్లారు. వారిలో ఒక యువకుడు నాటు తుపాకీ పట్టుకుని ఊపుతూ కనిపించాడు.
కాగా, ఆ తర్వాత హైవేపై ఆ బైక్ వేగంగా వెళ్లింది. బైక్ నడిపిన యువకుడు ముందున్న లారీలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. నియంత్రణ కోల్పోయిన అతడు వెనుక నుంచి ఒక లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు సోదరులు అక్కడికక్కడే మరణించారు. మరో బైక్‌పై వారిని అనుసరించి రీల్ రికార్డ్ చేస్తున్న ఇద్దరు యువకులు కూడా అదుపుతప్పి పడిపోయారు. వారిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను బేలా గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఉప్లక్ష్ కోల్, 22 ఏళ్ల అమ్రీష్ కోల్, 17 ఏళ్ల హేమరాజ్ కోల్‌గా గుర్తించారు. ప్రమాద స్థలం నుంచి నాటు తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా బైక్ నడపటం, అతివేగం, యువకుల నిర్లక్ష్య ప్రవర్తనే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణాలని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MP मऊगंज: रील्स के नशे में हाईवे पर वीडियो शूटिंग! पल्सर बाइक ट्रक से टकराई। उपलक्ष्य कोल (17), अमरीश कोल (22), हेमराज कोल (17) की मौके पर मौत।
दूसरी बाइक पर प्रशांत (19) और प्रदीप द्विवेदी (17) गंभीर। वीडियो अब वायरल!#MauGanj #Reels #RoadSafety #YouthAlert #MadhyaPradesh… pic.twitter.com/XoVZBmxqJL— Maharashtra Bandhu News (@BandhuNews_in) April 19, 2026
Also Read:
Americans detained | లగేజ్‌లో శాటిలైట్ ఫోన్లు.. అదుపులో ఇద్దరు అమెరికన్లు
India warns Iran | ‘పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’.. రెండు ట్యాంకర్ల దాడిపై ఇరాన్‌కు భారత్ హెచ్చరిక
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

