శ్రీనగర్: విమాన ప్రయాణికుల లగేజ్‌లో శాటిలైట్ ఫోన్లను భద్రతా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని కలిగి ఉన్న ఇద్దరు అమెరికా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. (Americans detained) దర్యాప్తు కోసం వారిని పోలీసులకు అప్పగించారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజ్‌ను భద్రతా అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అమెరికా పౌరులైన ఇద్దరి సామానులో నిషేధిత వస్తువైన శాటిలైట్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.
కాగా, అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరిని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా గుర్తించారు. గార్మిన్ కంపెనీకి చెందిన శాటిలైట్ ఫోన్‌ను అతడి లగేజ్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.
మరోవైపు ముందస్తు అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ల వినియోగాన్ని దేశంలో నిషేధించారు. వీటిని అనధికారికంగా కలిగి ఉంటే భారత టెలిగ్రాఫ్ చట్టం, ఇతర భద్రతా నిబంధనల ప్రకారం నిర్బంధం, అరెస్ట్‌కు దారితీస్తుంది. గతంలో కూడా శాటిలైట్ ఫోన్లు కలిగిన విదేశీయులతో పాటు దేశీయులపై అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read:
India warns Iran | ‘పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’.. రెండు ట్యాంకర్ల దాడిపై ఇరాన్‌కు భారత్ హెచ్చరిక