టెహ్రాన్: హార్ముజ్ జలసంధిని దాటేందుకు శనివారం ప్రయత్నించిన రెండు భారతీయ ట్యాంకర్లపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. (Indian tankers attacked) ఈ సందర్భంగా ఒక భారతీయ ట్యాంకర్ కెప్టెన్ ఇరాన్ నేవీతో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ‘హార్ముజ్‌లో వెళ్లేందుకు మీరు అనుమతి ఇచ్చారు, ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘సన్మార్ హెరాల్డ్’ అనే ట్యాంకర్ కెప్టెన్ ఇరాన్ నేవీతో ఇలా మాట్లాడారు. ‘సెపా నేవీ! సెపా నేవీ! ఇది ‘సన్మార్ హెరాల్డ్’ అనే మోటార్ ట్యాంకర్. వెళ్ళడానికి మీరు నాకు అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి’ అని ఆయన అన్నారు.
కాగా, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సిబ్బంది కాల్పులు జరుపడంతో భారత్‌కు చెందిన ఆ రెండు ట్యాంకర్లు శనివారం తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఇందులో ఒకటైన సూపర్ ట్యాంకర్ సుమారు 20 లక్షల బ్యారెళ్ల ఇరాకీ చమురును తీసుకువెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు నౌకలను పశ్చిమం వైపు మళ్లిస్తున్న సమయంలో ఐఆర్జీజీసీ గన్బోట్లు కాల్పులు జరిపినట్లు ఆడియో ఇంటర్సెప్ట్లు సూచించాయి. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు హార్ముజ్ జలసంధిలోని వాణిజ్య నౌకలకు ఐఆర్జీసీ శనివారం హెచ్చరిక జారీ చేసింది. ‘ఓడలన్నిటికీ గమనిక, చర్చలలో అమెరికా ప్రభుత్వం తన నిబద్ధతను నెరవేర్చడంలో విఫలమైనందున, హోర్ముజ్ జలసంధిని మరోసారి పూర్తిగా మూసివేస్తున్నాం. ఏ రకమైన లేదా ఏ దేశానికి చెందిన ఓడ కూడా హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతించబోం’ అని ఇరాన్ పేర్కొంది.
Ships coming under fire as they try to transit the Strait of Hormuz@ABC obtained audio capturing a radio message from an Indian-flagged oil tanker. The frantic crew pleads with Iran’s navy as the ship comes under attack pic.twitter.com/MqUCKozS4R
— Selina Wang (@selinawangtv) April 18, 2026
Also read:
Strait of Hormuz | హర్మూజ్ ద్వారా ఏ ఒక్క నౌక కూడా కదలొద్దు..ఐఆర్జీసీ వార్నింగ్
Asim Munir | ఇరాన్‌తో అమెరికా చర్చలు.. వివాదాస్పదంగా పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ వైఖరి