Asim Munir : ఇరాన్-అమెరికా మధ్య చర్చల్లో పాక్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాక్ ప్రధాని షెహబాజ్తోపాటు, పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా కీలకంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు అసిమ్ మునీర్ అంశం వివాదాస్పదంగా మారింది. అతడికి ఇరాన్ సైన్యంతో కూడా సత్సంబంధాలున్నట్లు తాజాగా అమెరికా నివేదికలో బయటపడింది. అంతేకాదు.. పాక్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మునీర్‌కు చాలాకాలంగా ఇరాన్‌లోని సైన్యమైన ఐఆర్‌జీసీతో సత్సంబంధాలున్నాయని సయీద్ వెల్లడించారు.
అలాగే, ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ నేత ఖాసీ సులేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హోస్సేన్ సలామీతో కూడా మంచి సంబంధాలున్నాయని తెలిపాడు. దీంతో మునీర్‌కు అమెరికా, ఇరాన్‌తో బలమైన సంబంధాలు ఉండటంతో తాజా చర్చల్లో వ్యూహాత్మక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చల్లో అమెరికా.. ఎక్కువగా పాకిస్తాన్నే నమ్ముకుంది. షెహబాజ్, మునీర్ ఇద్దరూ అమెరికాకు అనుకూలమైన వ్యక్తులు. వీరు అమెరికాకు మద్దతుగా ఉండాలి. కానీ, వీరిలో మునీర్‌కు ఇరాన్‌తో కూడా సంబంధాలున్నాయి. ఇది తమకు మంచిది కాదని అమెరికా భావిస్తోంది. అయితే, మునీర్‌పై ఇంతకుముందు ట్రంప్ ప్రశంసలు కురిపించాడు. ఆయన తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని తెలిపాడు. అయితే, పాకిస్తాన్‌ను అంతగా నమ్మడం సరికాదని అమెరికా మీడియా చెబుతోంది. గతంలో అమెరికాకు సన్నిహితంగా ఉంటూనే, ఆఫ్ఘనిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించిందని అక్కడి మీడియా గుర్తు చేస్తోంది.
ఇప్పుడు మునీర్‌కు ఇరాన్‌తో సంబంధాలుండటం ట్రంప్ నాయకత్వానికి మంచిది కాదని సూచిస్తోంది. చర్చల సందర్భంగా ఇరాన్‌కు అనుకూలమైన నిర్ణయం తీసుకునేందుకు మునీర్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. ఈ చర్చల ద్వారా వీలైనంతగా ఇరాన్ ప్రయోజనాల్ని కాపాడటానికి మునీర్ ప్రయత్నించవచ్చని, అందుకే పాకిస్తాన్‌ను నమ్మకూడదని అమెరికా విశ్లేషకులు అంటున్నారు.