లక్నో: ఒక వ్యక్తి సెల్ఫీ కోసం వంతెన వద్ద ఆగాడు. ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని నదిలోకి విసిరేశాడు. భార్యను కూడా నదిలోకి తోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అతడ్ని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఆ చిన్నారి కోసం నదిలో గాలిస్తున్నారు. (Man Throws Infant Into River) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 12న రింకూ అనే వ్యక్తి తన భార్య లక్ష్మి, ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెతో కలిసి ఆగ్రా వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. యమునా నదిపై ఉన్న అక్బరా వంతెన వద్దకు చేరుకున్న తర్వాత సెల్ఫీ కోసం బైక్ ఆపాడు.
కాగా, రింకూ తన ఏడాదిన్నర కుమార్తెను పట్టుకుని బ్రిడ్జి రెయిలింగ్ వద్దకు వెళ్లాడు. పాపతో సెల్ఫీ తీసుకున్న తర్వాత ఆ చిన్నారిని నదిలోకి విసిరేశాడు. ఇది చూసి భార్య లక్ష్మి షాక్ అయ్యింది. భర్త వద్దకు పరుగున ఆమె వచ్చింది. అయితే భార్యను కూడా వంతెన పైనుంచి నదిలోకి తోసేందుకు రింకూ ప్రయత్నించాడు.
మరోవైపు లక్ష్మీ అరుపులు విన్న జనం అక్కడ గుమిగూడారు. చిన్నారి అయిన కుమార్తెను నదిలోకి అతడు విసిరేసినట్లు తెలుసుకుని వారు ఆగ్రహం చెందారు. రింకూపై దాడి చేసి కొట్టారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు. ఆ చిన్నారి కోసం గజ ఈతగాళ్లతో యమునా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రింకూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kaliyuga father: Threw 11-year-old innocent girl off Yamuna bridge in Agra; tried to throw his wife off too, but passersby saved her life.
ऐसे नीच विधर्मी को औलाद देते क्यों है भगवान pic.twitter.com/vYLLsf1xxB
— Ramesh Tiwari (@rameshofficial0) August 16, 2026