Donald Trump | బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదు.. మమ్మల్ని ఒత్తిడికి గురిచేయలేరు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Donald Trump | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ (Iran) ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. జలసంధి అంశాన్ని తీసుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించవద్దని స్పష్టంగా హెచ్చరించారు.
Donald Trump : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ (Iran) ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. జలసంధి అంశాన్ని తీసుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించవద్దని స్పష్టంగా హెచ్చరించారు. వైట్‌హౌస్ (White House) లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు.
ఈ తరుణంలోనే ఇరాన్ పాలకులు జలసంధిని మళ్లీ మూసివేయాలనే చర్యలకు దిగుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. గతంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారని, అయితే అమెరికాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురిచేయలేరని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ శాంతి చర్చల విషయంలో మరో ప్రకటన చేసింది. అమెరికా ప్రతిపాదించిన కొత్త ఆఫర్లను పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆ ప్రతిపాదనలను తమకు అందజేశారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.
అయితే ఆ ప్రతిపాదనల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అమెరికా తన డిమాండ్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరాన్ సూచించింది. యుద్ధం పూర్తిగా ముగిసే వరకు హర్మూజ్ జలసంధి రాకపోకలపై పూర్తి నియంత్రణ కొనసాగిస్తామని కూడా ఇరాన్ స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

