రాయ్‌పూర్: ఒక ప్రైవేట్ జెట్ విమానం చెట్టును ఢీకొట్టింది. అదుపుతప్పిన అది కొండపై కూలింది. సంఘటనా స్థలంలో మంటలు, పొగలు కనిపించాయి. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. (Private jet crashes) ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం జష్పూర్ – నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంపై తక్కువ ఎత్తులో ఎగురుతున్న ప్రైవేట్ జెట్ విమానం ఒక చెట్టును ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ విమానం కొండ వాలుపై కూలిపోయింది. దీంతో మంటలు, పొగలు కనిపించాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలిన చార్టడ్ విమానంలోని పైలట్, కో పైలట్ మరణించినట్లు గుర్తించారు. ఈ విమానం కూలిన సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
BREAKING
छत्तीसगढ़ के जशपुर में प्लेन क्रैश, इलाके में अफरा-तफरी. नारायणपुर के रतनपहली जंगल में पेड़ों से टकराया चार्टर्ड प्लेन. हादसे के बाद उठीं आग की लपटें और धुएं का गुबार. पुलिस-प्रशासन मौके पर, राहत-बचाव कार्य जारी. विमान में कितने लोग सवार थे, इसकी जानकारी नहीं मिल पाई है.… pic.twitter.com/DeSqtFNjit— Prabhat Khabar (@prabhatkhabar) April 20, 2026
Also Read:
Mid-air scare | హైదరాబాద్-హుబ్లీ విమానంలో సాంకేతిక లోపం.. బెంగళూరుకు దారిమళ్లింపు
Fire At Rajasthan Refinery | ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ముందు రోజు.. రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
BJP MLA Threatens Cops | వాహనంతో ఐదుగురిని ఢీకొట్టిన కొడుకు.. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్