Mid-air scare | హైదరాబాద్-హుబ్లీ విమానంలో సాంకేతిక లోపం.. బెంగళూరుకు దారిమళ్లింపు
Mid-air scare | హైదరాబాద్ (Hyderabad) నుంచి హుబ్లీ (Hubballi) వెళుతున్న ఫ్లై 91 విమానాన్ని బెంగళూరు (Bengalore) కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య (Technical Issue) ఎదురైనట్టు అధికారులు వెల్లడించారు. విమానాన్ని దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
Mid-air scare : హైదరాబాద్ (Hyderabad) నుంచి హుబ్లీ (Hubballi) వెళుతున్న ఫ్లై 91 విమానాన్ని బెంగళూరు (Bengalore) కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య (Technical Issue) ఎదురైనట్టు అధికారులు వెల్లడించారు. విమానాన్ని దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
కాగా ఆదివారం రోజు సాంకేతిక సమస్యలవల్ల విమానం మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో బిగ్గరగా ఏడుస్తూ క్షేమంగా కిందకు దిగాలని ప్రార్థనలు చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఫ్లై 91 (Fly91) బయలుదేరింది. అది 4.30 కు హుబ్లీ చేరుకోవాలి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు.
ఆ తర్వాత విమానం సాయంత్రం 6.30 కు బెంగళూరు నుంచి తిరిగి ప్రారంభమైందని చెప్పారు. హుబ్లీ చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయ్యిందని, 22 మంది ప్యాసింజర్లు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇదిలాఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల ముంబై నుంచి కొల్హాపుర్కు వెళ్లాల్సిన మరో విమానాన్ని గోవాకు (Goa) మళ్లించారు. విమానంలో సమస్య ఏం లేదని, ఇందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

