తెలంగాణ భవన్లో ‘పెద్ది సంస్మరణ కార్యక్రమం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి నేపథ్యంలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
- ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నేతల పుష్పాంజలి
హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి నేపథ్యంలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్చార్జి, ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ నేతలతో కలిసి పెద్ది చిత్ర పటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. సుదర్శన్‌రెడ్డి పార్టీకి అందించిన సేవలను రావుల కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని బీఆర్టీయూ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, నాయకులు పీ నారాయణ, వేముల మారయ్య, ఆర్ పరమేశ్వర్, మహేశ్, సాయి, హరి, ప్రభాకర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని రాంబాబు యాదవ్ నెమరేసుకున్నారు. పెద్ది మరణం బీఆర్ఎస్కు తీరనిలోటని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా ఇన్చార్జి అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని బీఆర్ఎస్ ఎన్నారైల తరఫున నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

