OTT Moives | ఈ వారం తెలుగులో పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోయినా, ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మలయాళంలో సంచలన విజయం సాధించిన ఒక బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు తెలుగులోకి వస్తుండగా, మరోవైపు థ్రిల్లర్ జానర్లో రూపొందిన చిన్న సినిమాలు కూడా థియేటర్లలో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కొత్త కంటెంట్ సందడి చేయనుంది.
మొదటగా మలయాళ సూపర్ హిట్ చిత్రం వాళా 2 తెలుగులో విడుదలకు సిద్ధమైంది. కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి సుమారు రూ.205 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. 2024లో వచ్చిన ‘వాళా’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందింది. నలుగురు కాలేజీ యువకుల జీవిత ప్రయాణం, వారి ఎదుగుదల ఈ సినిమా ప్రధాన కథాంశంగా ఉంది. ఈ చిత్రానికి Savin SA దర్శకత్వం వహించగా, విపిన్ దాస్‌తో కలిసి తెలుగు నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక థ్రిల్లర్ జానర్లో వస్తున్న మరో సినిమా ‘గేదెల రాజు… కాకినాడ తాలూకా…’. ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ఈ మర్డర్ మిస్టరీ చిత్రం కూడా ఇదే తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవి ఆనంద్, రామచంద్రం, శ్రావ్య, వికాస్, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇవే కాకుండా, చిన్న సినిమాలు, డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందిన పలు చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఏప్రిల్ 20న
కో కామిలాన్ లేన్ వెబ్ సిరీస్ సీజన్ 7 (నెట్ ఫ్లిక్స్)
కిల్ టోనీ మేనియా (ఇంగ్లీష్ మూవీ – నెట్ ఫ్లిక్స్)
ఫ్రమ్ 4 (వెబ్ సిరీస్ – ప్రైమ్ వీడియో)
కెవిన్ (వెబ్ సిరీస్ – ప్రైమ్ వీడియో)
రెసిల్ మేనియా (స్పోర్ట్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్)
ఏప్రిల్ 21న
అన్ చూసెన్ (నెట్ ఫ్లిక్స్)
అన్ టోల్డ్ : ది షూటింగ్ ఎట్ హాత్రోన్ హిల్ (నెట్ ఫ్లిక్స్)
రీబోర్న్ (జపనీస్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), జాంట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
కెన్నెల్డ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
లేట్ షిఫ్ట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ప్రొటక్టర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
మేబల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ది సర్పెంట్ స్కిన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
టో (అమెజాన్ ప్రైమ్ వీడియో).
ఏప్రిల్ 22న
లేచింది మహిళా లోకం (తెలుగు మూవీ – సన్ నెక్స్ట్)
కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లిష్ సిరీస్ – ప్రైమ్ వీడియో)
హల్క్ హోగన్ (వెబ్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్)
సంతిత (నెట్ ఫ్లిక్స్), సోల్డ్ అవుట్ ఆన్ యు (కొరియన్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్)
దిస్ ఈజ్ ఏ గార్డినింగ్ షో (నెట్ ఫ్లిక్స్), ది లాస్ట్ షూట్ (నెట్ ఫ్లిక్స్)
లెయినీ విల్సన్ (నెట్ ఫ్లిక్స్)
ఒరంగుటన్ (జియో హాట్ స్టార్)
ఏప్రిల్ 23న
స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్)
ఫ్లంక్డ్ (నెట్ ఫ్లిక్స్), యియా మురానో (నెట్ ఫ్లిక్స్)
ఆన్ యువర్ ల్యాప్ (నెట్ ఫ్లిక్స్)
రన్నింగ్ పాయింట్ (సీజన్ 2 – నెట్ ఫ్లిక్స్)
ఏప్రిల్ 24 న
హ్యాపీ రాజ్ (ప్రైమ్ వీడియో)
బ్యాండ్ మేళం (ZEE5)
ప్రతి చాయ (జియో హాట్ స్టార్)
అపెక్స్ (నెట్ ఫ్లిక్స్)
ఇఫ్ విషెష్ కుడ్ కిల్ (కొరియన్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్)
సోనిక్ 3 (నెట్ ఫ్లిక్స్)
ఇమ్మోర్టల్ కంబ్యాట్ (ప్రైమ్ వీడియో)
మార్టి సుప్రీమ్ (HBO Max)
నో అదర్ ఛాయిస్ (HULU)
సెకండ్ ఆఫ్ ఫాలింగ్ (MUBI)
నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో)
24 (హిందీ సిరీస్ – జియో హాట్ స్టార్)
నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో)
ఏప్రిల్ 25 – మై డ్రెస్సప్ డార్లింగ్ (నెట్ ఫ్లిక్స్)
ఏప్రిల్ 26 – 28 ఇయర్స్ లేటర్ (నెట్ ఫ్లిక్స్).