హైదరాబాద్ : అమెరికా- భారత్ ( America- US)మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందానికి తుది రూపునిచ్చే లక్ష్యంతో ఇరు దేశాలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో కొత్త విడత వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. ఏప్రిల్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ చర్చల కోసం కేంద్ర వాణిజ్య అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలో ఇండియా నుంచి సుమారు 12 మంది అధికారుల బృందం వాషింగ్టన్కు చేరుకుంది.
రెండు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య చర్చలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమెరికా- భారత్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం (బీటీఏ) తొలి దశపై అమెరికా వాణిజ్య అధికారులతో దర్పణ్ జైన్ టీం చర్చలు జరుపనున్నది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇరు దేశాలు పెట్టుకున్నాయి. అలాగే అమెరికా ఎనర్జీ ఉత్పత్తులు, టెక్నాలజీ, విమానాలు, కోకింగ్ కోల్ చేయాలని ఇండియా ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
ఇవి కూడా చదవండి..
Harish rao | ఢిల్లీ పర్యటనకు హరీశ్..కాళేశ్వరం కేసులపై లాయర్లతో చర్చించేందుకే వెళ్లినట్టు వెల్లడి
Iran | ఐఆర్జీసీ గుప్పిట్లోకి ఇరాన్ పాలన?! ఉదారవాదులు పక్కకు.. పిడివాదులు తెరపైకి