తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీగా తరలిరావడంతో జగిత్యాల జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా నిర్వహించిన సభకు ప్రజల మద్దతు భారీగా లభించింది. మధ్యాహ్నం నుంచే సభాస్థలికి జనం తండోపతండాలుగా తరలిరావడం కనిపించింది. జగిత్యాల పట్టణంలోని రోడ్లన్నీ జనసమ్మర్థంగా మారాయి.
నాలుగు గంటల వరకు జగిత్యాల మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆరుగంటలకు మినీస్టేడియానికి నలువైపులా ఉన్న రోడ్లు కిలోమీటర్ల పొడవునా జనంతో నిండిపోయాయి. స్టేడియానికి అరకిలోమీటర్ దూరం వరకు ప్రతి రెండు వందల మీటర్లకు ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ జనం పోటెత్తారు. సభ గ్రాండ్ సక్సెస్‌తో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.

హెలికాప్టర్ దిగుతూ నాయకులకు అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన జనసందోహం

జగిత్యాల సభలో గులాబీ కండువా తిప్పుతూ ప్రజలను హుషారెత్తిస్తున్న చిన్నారి

జగిత్యాలలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు దండులా కదిలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ఉన్న అచంచలమైన అభిమానంతో ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు. చిత్రంలో జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

జగిత్యాల సభ కోసం ఎర్రవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో ఎమ్మెల్సీ దేశపతి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపన్యాసానికి మంత్ర ముగ్ధులై చేతులెత్తి నినదిస్తున్న ప్రజలు

భారీగా తరలివచ్చిన జనంతో జగిత్యాల సభా ప్రాంగణం కిక్కిరిసింది. దీంతో సమీపంలో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్‌లో సభను వీక్షిస్తున్న ప్రజానీకం