Korean Kanakaraju Trailer | ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ అదిరింది.. డ్యూయల్ షేడ్స్, కామెడీతో అంచనాలు పెంచిన వరుణ్
Korean Kanakaraju Trailer | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజా ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందినట్లు తెలుస్తోంది.
Korean Kanakaraju Trailer | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజా ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందినట్లు తెలుస్తోంది. అనంతపురానికి చెందిన ఓ సాధారణ యువకుడు, కొరియన్ మాఫియా ప్రపంచం మధ్య జరిగే ఆసక్తికర పరిణామాలే కథకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. హారర్, కామెడీ, యాక్షన్ అంశాలను దర్శకుడు మేర్లపాక గాంధీ వినోదాత్మకంగా రూపొందించినట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఒకవైపు అనంతపురం యువకుడిగా మాస్ బాడీ లాంగ్వేజ్‌తో అలరిస్తూనే, మరోవైపు కొరియన్ మాఫియా డాన్ పాత్రలో స్టైలిష్ లుక్, స్వాగ్తో ఆకట్టుకున్నారు. రెండు పాత్రలకు భిన్నమైన హావభావాలు, బాడీ లాంగ్వేజ్, మేకోవర్‌తో వరుణ్ తేజ్ చూపించిన వైవిధ్యం అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో నటుడు సత్య చెప్పిన పంచ్ డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ రిథికా నాయక్ తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి ఆదరణ పొందగా, ట్రైలర్లో ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా యాక్షన్, హారర్ సన్నివేశాల్లో థమన్ సంగీతం సినిమాకు అదనపు బలంగా కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ట్రైలర్లో కనిపించిన విజువల్స్, సెట్స్, సాంకేతిక నాణ్యత సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలియజేస్తున్నాయి.ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. హారర్, కామెడీ, యాక్షన్, ఎమోషన్లతో కూడిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. వరుణ్ తేజ్ ఖాతాలో మరో విజయవంతమైన చిత్రం చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

