Miheeka Bajaj | స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వారి కుటుంబ జీవితం, రోజువారీ అలవాట్లు, ఇంటి సంస్కృతి వంటి విషయాలు బయటకు వస్తే అవి వెంటనే చర్చనీయాంశంగా మారిపోతాయి. తాజాగా హీరో రానా దగ్గుపాటి భార్య మిహికా బజాజ్ గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యాపార కుటుంబానికి చెందిన మిహీక బజాజ్ ఓ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఆమె నిర్వహిస్తున్న “Dew Drop Design Studio” అనే ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు డెకర్ సంస్థ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. క్రియేటివిటీ, బిజినెస్ మైండ్‌తో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. అయితే ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సింపుల్‌గా ఉండటం ఆమె ప్రత్యేకత.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మిహీక తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లికి ముందు అప్పుడప్పుడు వంట చేసేదాన్నని చెప్పిన ఆమె, పెళ్లి తర్వాత మాత్రం కిచెన్ వైపు వెళ్లాల్సిన అవసరం రాలేదని నవ్వుతూ వెల్లడించారు. దీనికి కారణం తన అత్తమ్మ వంట ప్రతిభ అని పేర్కొన్నారు. “అమ్మ చాలా బాగా వంట చేస్తారు” అని చెప్పిన ఆమె, అత్తమ్మను ‘అమ్మ’ అని పిలుస్తానని చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వ్యాఖ్యలు చూస్తే ఆమెకు అత్తమామలతో ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది.
ఇంకా వంటల విషయానికి వస్తే, తన అత్తమ్మ చేసిన మటన్ కర్రీ తనకు ఎంతో ఇష్టమని మిహీక తెలిపారు. తన జీవితంలో అంత రుచిగా మటన్ ఎప్పుడూ తినలేదని చెప్పడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు ఫిట్నెస్, డైట్లపై దృష్టి పెట్టే ఈ కాలంలో, ఇలాంటి హోమ్ ఫుడ్‌పై ఆమె చూపిన ప్రేమ అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, కుటుంబ విలువలు, అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్న జంటగా రానా–మిహీక నిలుస్తున్నారు. వారి దాంపత్య జీవితం కేవలం స్టార్డమ్కే పరిమితం కాకుండా, సాదాసీదా కుటుంబ జీవనశైలిని ప్రతిబింబిస్తోందని చెప్పాలి.