హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ ఈ నెల 22న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలోని ఏసీబీ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.