అహ్మదాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ఎల్పీజీ సంక్షోభం దేశంలోని పలు రంగాలపై ప్రభావం చూపుతున్నది. పరిశ్రమలకు అంతరాయం కలిగిస్తున్నది. దీనికి తోడు వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్ స్టేషన్ శనివారం నుంచి అనూహ్యంగా ప్రయాణికులతో కిక్కిరిసింది.
కాగా, ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్లేందుకు ఆదివారం ఉదయం వేలాది మంది ప్రయాణికులు సూరత్‌లోని ఉధ్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో భారీ జనసమూహాన్ని నియంత్రించేందుకు రైల్వే పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో గందరగోళానికి దారితీసింది.
మరోవైపు భారీగా తరలివచ్చిన ప్రయాణికులను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి ఆరు రైళ్లలో 21,000 మందికి పైగా ప్రయాణికులు ఉధ్నా నుంచి బయలుదేరినట్లు రైల్వే అధికారి అనుభవ్ సక్సేనా వెల్లడించారు.
అయితే ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటం, పరిస్థితి అదుపు తప్పడంతో కఠిన చర్యలు చేపట్టక తప్పలేదని రైల్వే అధికారి వివరించారు. వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన ఆ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
This is the Western railway @AshwiniVaishnaw @WesternRly,see the scenario of Udhna Railway Station,and Government @narendramodi is not running special train for going to Uttar Pradesh,only they need vote of the UP people for election. pic.twitter.com/NlgdfIxQY0
— Rahul Bajaj (@Tom306202) April 19, 2026
सूरत : उधना रेलवे स्टेशन पर ट्रेन में सीट पाने के लिए लोगों के बीच मची भगदड़
◆ लोगों को नियंत्रित करने के लिए पुलिस को हलका बल प्रयोग करना पड़ा
◆ घटना में कई यात्री मामूली रूप से घायल भी हो गए हैं
◆ घटना का वीडियो आया सामने#Surat | Surat | #Gujarat | Gujarat pic.twitter.com/NeeDnCMqDH
— News24 (@news24tvchannel) April 19, 2026
VIDEO | Surat, Gujarat: Anubhav Saxena, PRO, Western Railway, says, “The situation is normal at Udhna Railway station. With the onset of the summer season, necessary arrangements have been put in place for passengers. Special trains are being operated, additional ticket counters… pic.twitter.com/ure2RxC7sd
— Press Trust of India (@PTI_News) April 19, 2026