e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Madhumita | ప్ర‌స్తుతానికి ప్రేమ, పెండ్లి ఆలోచ‌న‌లు లేవంటున్న నెం.1 కోడ‌లు ఫేమ్‌ మ‌ధుమిత‌

Madhumita | ప్ర‌స్తుతానికి ప్రేమ, పెండ్లి ఆలోచ‌న‌లు లేవంటున్న నెం.1 కోడ‌లు ఫేమ్‌ మ‌ధుమిత‌


No 1 kodalu serial actress Madhumita | ‘మనసున మనసై’ అంటూ తెలుగువారి మనసు దోచేసింది బుల్లితెర నటి మధుమిత. ఇప్పుడు జీ తెలుగు ‘నెం.1 కోడలు’ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. అందం, అమాయకత్వం కలబోసిన అభినయంతో ‘సరసు’గా అందరినీ ఆకట్టుకుంటున్న మధుమితతో ‘జిందగీ’ ముచ్చట్లు..

No 1 kodalu serial actress Madhumita
No 1 kodalu serial actress Madhumita

మాది బెంగళూరు. పుట్టింది, పెరిగింది, చదువుకున్నది.. అంతా అక్కడే. చిన్నప్పటినుంచీ సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. బడిలో, కాలేజ్‌లో ఏ ఫంక్షన్‌ జరిగినా పాల్గొనేదాన్ని. కాలేజీ రోజుల్లో నాన్న నా ఆసక్తిని గమనించారు. కెమెరామెన్‌గా పనిచేస్తున్న నాన్న స్నేహితుడు కూడా సినిమాలు, సీరియళ్లలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. స్టార్‌ సువర్ణ చానల్‌ ‘పుట్మల్లి’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. అలా చిన్నతెరకు పరిచయమయ్యా. మొదటి సీరియల్‌తోనే మంచిపేరు వచ్చింది. అందులో నటిస్తుండగానే స్టార్‌ మా ‘మనసున
మనసై’లో అవకాశం ఉందంటూ పిలుపు వచ్చింది. అలా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాను.

చాలా ప్రత్యేకం

- Advertisement -

తమిళంలోనూ ఒక సీరియల్‌లో నటించా. కానీ తెలుగు పరిశ్రమ నాకు చాలా ప్రత్యేకం. తొలినాళ్లలో తెలుగు కొంత కష్టంగా అనిపించినా, నా మాతృభాష కన్నడకు దగ్గరగా ఉండటంతో త్వరగానే పట్టుసాధించా. ఏదైనా భాషను ప్రేమిస్తేనే వేగంగా నేర్చుకోగలం. ప్రస్తుతం అర్థం చేసుకోవడమేకాదు బాగా మాట్లాడుతున్నా కూడా. ‘మనసున మనసై’ తర్వాత జీ తెలుగు ‘నెం.1 కోడలు’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. సీనియర్‌ నటి, డ్యాన్సర్‌ సుధాచంద్రన్‌ గారితో నటించే అదృష్టమూ దక్కింది. ఆమెతో పనిచేయడానికి మొదట్లో భయపడ్డాను. కానీ షూటింగ్‌ ప్రారంభం అయ్యాక మాలో ఒకరిగా కలిసిపోయారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ సందేహం వచ్చినా నేరుగా వెళ్లి అడుగుతాను. ఎంతో ఓపికగా సమాధానం చెబుతారామె. ఈ సీరియల్‌ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ‘మా సరసు’ అంటూ తమ ఇంట్లో అమ్మాయిని చూసినట్టు చూస్తున్నారు. ప్రేమ కురిపిస్తున్నారు.

No 1 kodalu serial actress Madhumita
No 1 kodalu serial actress Madhumita

రెండో ఇల్లు..

హైదరాబాద్‌ అంటే నాకు ప్రత్యేక అభిమానం. పుట్టి పెరిగిన బెంగళూరు కంటే కూడా ఎక్కువ ఇష్టం. ఇక్కడి ఆహారం, వాతావరణం బాగా నచ్చుతాయి. కాబట్టే, హైదరాబాద్‌ నా రెండో ఇల్లని సగర్వంగా చెబుతాను. నేను ప్రయాణాల్ని ఇష్టపడతాను. ఏ కాస్త ఖాళీ దొరికినా కుటుంబంతో గడుపుతాను.

ప్రేమ, పెండ్లి..

నాన్న రిటైర్డ్‌ ఉద్యోగి. అమ్మ ఇంకా ఉద్యోగం చేస్తున్నది. మేం ముగ్గురు ఆడపిల్లలం.. అక్క, నేను, చెల్లి. అన్నింట్లోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చి పెంచారు. అక్క ఎమ్మెన్సీలో ఉద్యోగం చేస్తున్నది. చెల్లి ఇంకా చదువుకుంటున్నది. ‘జీ కుటుంబం’ అవార్డుల కార్యక్రమానికి మా అమ్మా నాన్నలను కూడా ఆహ్వానించారు. వాళ్ల ముందు అవార్డు తీసుకోవడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. ప్రస్తుతం ప్రేమ, పెండ్లి వంటి ఆలోచనలేం లేవు. సమయం వచ్చినప్పుడు మన ప్రమేయం లేకుండా వాటంతట అవే జరిగిపోతాయని నా నమ్మకం. భిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుని.. జీవితంలో స్థిరపడటమే తక్షణ కర్తవ్యం. ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే సినిమాల్లోనూ చేయాలని ఉంది.

..✍ ప్రవళిక వేముల

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

అమెరికాలో సెటిల‌య్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ‌

Matla Tirupathi | నా పాట‌ల‌కు స్ఫూర్తి ఆమే.. ప‌ల్లె పాట‌ల‌తో దూసుకెళ్తున్న మాట్ల తిరుప‌తి ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఇవీ..

అప్ప‌ట్లో పాట‌లు పాడుతుంటే నక్సలైట్‌ అనుకొని పోలీసోళ్లు అరెస్ట్‌ చేస్తుండె. నక్సలైట్లేమో పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనుకుంటుండె…

Saami Saami | పుష్ప‌లో సామీ సామీ పాట పాడిన మౌనిక‌కు ఇన్‌స్పిరేష‌న్ ఈమెనే

భీమ్లా నాయ‌క్ సినిమాలో పాట పాడిన దుర్గ‌వ్వ ఎవ‌రో తెలుసా

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

నా పాట కోసం మా నాన్న‌ ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement