e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News అమెరికాలో సెటిల‌య్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ‌

అమెరికాలో సెటిల‌య్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ‌

Kathula Srija | తాతంటే ఆమెకు ప్రాణం. తాతకేమో పాటంటే ప్రాణం. మనుమరాలిని బుజ్జగించనీకె తాత పాట పాడితే.. తాతను ఉల్లాసపరిచేందుకు మనుమరాలు పాట నేర్చింది. తనకు తెలియకుండనే పల్లె పాటల గుమ్మంలోకి ప్రవేశించింది. రెండుతరాల బంధానికి ప్రాణం పోసిన పల్లెపదం.. నేడు కత్తుల శ్రీజ స్వరంతో ఎన్నో తరాల ముచ్చటను గుర్తుచేస్తున్నది. అనేక అవకాశాలు ఉన్నా పాటనే కెరీర్‌గా ఎంచుకొని పల్లె పాటల్ని పంచుకుంటున్న శ్రీజ పాట ముచ్చట..

Kathula Srija
Kathula Srija


మాది నల్గొండ లోకల్‌. నాన్న రాజారత్నం, అమ్మ సుమలత. అమ్మానాన్నల కంటే తాత కత్తుల నర్సయ్య దగ్గరే ఎక్కువగా పెరిగిన. నాతో తాతకు చాలా కాలక్షేపం అయ్యేది. పాతకాలపు ముచ్చట్లు చెప్తుండె. పాటలంటే ఏమిటో తెలియని వయసులో పల్లె పదాలు, బుర్రకథలు, బాగోతం పాటలు వినిపించి ఖుషీ చేస్తుండె. అలా ఒక కొత్త ప్రపంచానికి దగ్గరైన. తాత దగ్గర విన్న పాటలను బడిలో పాడేదాన్ని. టీచర్లు, తోటి విద్యార్థులు బాగా ఇష్టపడేటోళ్లు. అది తెలంగాణ ఉద్యమ సమయం. జానపదాలతో పాటు పోరాట గీతాలు కూడా పాడమని అడిగేవాళ్లు. అట్ల ఎన్నో వేదికల మీద ఉద్యమ గీతాలు ఆలపించిన. ‘శ్రీజ ఎసొంటి పాటైనా పాడుతది’ అనే గుర్తింపు సంపాదించిన. అమ్మానాన్న నా ఆసక్తిని గుర్తించిండ్రు. ఎంతో ప్రోత్సహించిండ్రు. మంచి రోజు లొస్తాయని ధైర్యం చెప్పిండ్రు.

వేరే అవకాశాలు ఉన్నా

- Advertisement -

మా నాన్న కలెక్టరేట్‌లో ఉద్యోగం చేస్తడు. అమ్మ టీచర్‌. చదువుకున్న కుటుంబమే. ఏ అమెరికానో వెళ్లి సెటిలయ్యే వెసులుబాటు ఉన్నది. కానీ, నాకు ఇష్టం లేదు. సింగర్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న. ‘అదేమైనా ఐఏఎస్సా? ఐపీఎస్సా?’ అన్న విమర్శలు వచ్చినా నేను పట్టించుకోలేదు. ఆ పట్టుదలే నన్ను పాటలవైపు పట్టుకెళ్లింది. అది కూడా వేరే ఎవరో అవకాశాలిస్తే కాదు. నేనే వెతుక్కున్న. స్టూడియోల వెంట తిరిగిన. వెళ్లిన అన్నిచోట్లా అవకాశాలు రావనీ, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండవనీ ముందుగాల్నే తెలుసుకున్న. పాటంటే ప్రాణం కాబట్టే, మంచిరోజు కోసం ఆత్మవిశ్వాసంతో ఎదురుచూసిన.

Kathula Srija

పొలిటికల్‌ సాంగ్స్‌

నల్గొండలనే ‘సుచరిత రికార్డింగ్‌ స్టూడియో’ ఉందని దోస్తులు చెప్పిండ్రు. ఒకసారి అక్కడ ప్రయత్నిద్దమని వెళ్లిన. ‘సార్‌! నాకు పాటలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి జానపదాలు వింటూ పెరిగిన. బాగా పాడగలను. అవకాశం కావాలె’ అని అడిగిన. ‘సరేగానీ, బయట పాడటం వేరు. స్టూడియో మ్యూజిక్‌లో పాడటం వేరు. అయినా సరే, ఒకసారి డెమో తీసుకుంటం. ఏదైనా పాడు’ అన్నరు. బాగా నచ్చిన జానపదమొకటి, తెలంగాణ ఉద్యమ గీతమొకటి వినిపించిన. ‘సూపర్‌! నీకు ఏ సంగీతమూ అవసరం లేదు పో..’ అనేసరికి మస్తు సంతోషపడ్డ. ‘కాకపోతే ప్రస్తుతం ఎలక్షన్‌ సీజన్‌ నడుస్తున్నది. పొలిటికల్‌ సాంగ్స్‌ పాడతవా మరి’ అన్నరు. ఏదో ఒకటి, నా గొంతు పదిమందికి వినిపించడమే ముఖ్యం అనుకొని పాడిన.

తరాలకు గుర్తుండేలా

నా ప్రయాణంలో కుటుంబం, దోస్తులు తప్ప ఇతరుల సహకారం తీసుకోలేదు. సమయం వృథా అవుతున్నదని అనిపించినప్పుడు, కొంతకాలం ఒక సంస్థలో ఉద్యోగం చేసిన. ఏడాదిపాటు కొలువు చేస్తూనే ప్రయత్నించిన. వేరే చోటుకు బదిలీ కావడంతో రాజీనామా చేసిన. అనుకున్నట్లుగానే జానపదాలు పాడే అవకాశం వచ్చింది. సుచరిత, రమేశ్‌ స్టూడియోస్‌లో అచ్చమైన పల్లె పదాలు పాడటం మొదలు పెట్టిన తర్వాత ఎన్నో అవకాశాలు తలుపుతట్టినయి. నేను పాడిన వాటిలో బావా మరదళ్ల పాటలే ఎక్కువ. ఇప్పటిదాకా యూట్యూబ్‌లో 50కి పైగా పాటలు పాడిన. ‘బాదైతుందే బావా’, ‘మస్తుంటావురా సక్కనోడా’ .. పాటలు నా పేరు మార్మోగేలా చేసినయి. లాక్‌డౌన్‌లో చరణ్‌ అర్జున్‌ అన్న చానల్లో పాడిన ‘దబ్బూన నువ్వురారో డార్లింగు మేనబావ’ పాట నాకు మంచిపేరు తీసు
కొచ్చింది. చిన్నప్పుడు మా తాత, మామయ్య దగ్గర నేర్చుకున్న పాటలు, నేను ఊర్లపొంటి తిరిగి సేకరించిన పాటలు.. అన్నిటినీ ఒడిసిపట్టుకొని తరతరాలకు గుర్తుండిపోయేలా నా చానల్‌ ద్వారా
పరిచయం చేయాలని అనుకుంటున్న.

ఎంచుకున్న రంగంలో నాకంటూ ఓ గుర్తింపు రావడంలో తోడ్పాటు అందించింది నా తల్లిదండ్రులు, స్నేహితులే. నేను థ్యాంక్స్‌ చెప్పుకునేది ఎవరికైనా ఉందీ అంటే అది వాళ్లకే. పాటను నేను ఎంచుకుంటే, ఆ పాట ముందుకు సాగేందుకు తగిన బాటను వాళ్లు చూపించిండ్రు.

…✍ దాయి శ్రీశైలం

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Matla Tirupathi | నా పాట‌ల‌కు స్ఫూర్తి ఆమే.. ప‌ల్లె పాట‌ల‌తో దూసుకెళ్తున్న మాట్ల తిరుప‌తి ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఇవీ..

అప్ప‌ట్లో పాట‌లు పాడుతుంటే నక్సలైట్‌ అనుకొని పోలీసోళ్లు అరెస్ట్‌ చేస్తుండె. నక్సలైట్లేమో పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనుకుంటుండె…

Saami Saami | పుష్ప‌లో సామీ సామీ పాట పాడిన మౌనిక‌కు ఇన్‌స్పిరేష‌న్ ఈమెనే

భీమ్లా నాయ‌క్ సినిమాలో పాట పాడిన దుర్గ‌వ్వ ఎవ‌రో తెలుసా

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

నా పాట కోసం మా నాన్న‌ ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు

Folk Singer Veena | పచ్చని సెట్టూమీద.. పతిరామ సిలకా!

శెనగచేన్ల నిలావడి చేతులియ్యావే.. దాసరి సంధ్య పాట ముచ్చట!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement