e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home యాదాద్రి ఆహార ఉత్పత్తులకు అందలం

ఆహార ఉత్పత్తులకు అందలం

ఆహార ఉత్పత్తులకు అందలం
  • జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏర్పాటుకు కసరత్తు
  • మల్కాపూర్‌ వద్ద ఇప్పటికే 300 ఎకరాలు గుర్తింపు
  • ప్రత్యక్షంగా.. పరోక్షంగా 20వేల మందికి పైగా లబ్ధి
  • స్థానిక ఉత్పత్తులకు ప్రత్యక్ష లాభాలు చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి

యాదాద్రి భువనగిరి, జూన్‌11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వివిధ వర్గాల ప్రజానీకానికి ఉపాధి అవకాశాలను మెండుగా క ల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది. స్థానిక ఉత్ప త్తులను ఇతర దేశాలు, రాష్ర్టాలకు ఎగుమతి చేసి ప్రాచుర్యం క ల్పించడంతో పాటు రైతాంగానికి ప్రత్యక్ష లాభాలు చూపించాల ని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. కల్తీ లేని ఆహారాన్ని అందుబా టులోకి తేవడంతోపాటు, తక్కువ ధరలకే వినియోగదారుడికి పలు రకాల ఆహార ఉత్పత్తులను అందించే దిశగా ప్రణాళికలను రూపొందించి అమలు పర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు వలసలకు మారుపేరుగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా భారీ పరిశ్రమల ఏర్పాటుతో నేడు ఉపాధి అవకాశాలకు కేరాఫ్‌గా నిలువగా.. రాష్ట్ర రాజధానికి చెంతనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా రానున్న రోజుల్లో ఆహార ఉత్తత్తుల పరంగా నూ.. అగ్రగామిగా నిలువనుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుతో 20 వేల మందికి పైగా స్థానికులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లబ్ధి చేకూరనుంది.’

యాదాద్రి భువనగిరి జిల్లాలో పంటల దిగుబడి భారీగా పెరి గింది. మూసీ జలాలతో పాటు కాళేశ్వరం జలాలు సైతం అందు బాటులోకి రావడంతో సాగునీటి ఇబ్బందులు తీరాయి. ఒకప్పు డు ఒక్క పంటను కూడా పండించని రైతులు నేడు రెండు పం టలను సాగు చేసుకుంటున్నారు. గత యేడాది యాసంగిలో జిల్లాలో 2.46లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేయగా.. అం దులో 2.40లక్షల ఎకరాల్లోనూ వరి పంటనే రైతులు సాగు చేశా రు. ఈ క్రమంలో ఊహించని రీతిలో 4.80లక్షల మెట్రిక్‌ టన్ను ల దిగుబడులు వచ్చాయి. ప్రస్తుత వానకాలంలో 4.46లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తు న్నారు. ఇందులో సింహభాగం వరి పంటనే సాగు కానుంది. అయితే పండించిన పంటలను ఎగుమతి చేసేందుకు సరైన వన రులు లేవు. జిల్లా వ్యాప్తంగా 30 రైస్‌ మిల్లులు మాత్రమే ఉండ డంతో ఇక్కడి ఉత్పత్తులను డిమాండ్‌కు తగ్గట్టుగా ఎగుమతి చేయలేకపోతున్నారు.జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పా టులో భాగంగా రైస్‌ మిల్లుల ఏర్పాటుకే ప్రాధాన్యత కల్పించ నుండడంతో ఇక్కడి బియ్యానికి బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగి రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర పలుకుతుంది.

మల్కాపురంలో 300 ఎకరాలు గుర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేసేం దుకు స్థానికంగా ఉన్న స్థలాలను గుర్తించాలని ఇటీవల ప్రభు త్వం అధికారులను ఆదేశించింది. అయితే గత యేడాదే జిల్లా లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏర్పాటు కోసం అధికారులు హైద్రాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న మల్కాపురం వద్ద అను వైన స్థలాన్ని గుర్తించారు. సర్వే నం.89లో 300 ఎకరాలు ప్రాసె సింగ్‌ యూనిట్‌కు యోగ్యంగా ఉందని నిర్థారించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే సదరు స్థలాన్ని అభివృద్ది చేసి నీరు, డ్రైనేజి, రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపా యాలను కల్పించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపా యాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)కి అప్పగించనున్నారు. బియ్యం ప్రా సెసింగ్‌కు సంబంధించిన యూనిట్లతో పాటు ఇతర ఉత్పత్తుల కు సైతం ప్రాధాన్యత కల్పించే దిశగా సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో జిల్లా అగ్రగామిగా ఉంది. మదర్‌ డెయిరీకి నిత్యం 35-40వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా.. మరో 20వేల వరకు ఇతర డెయిరీలకు, మార్కెట్లలో పాడి రైతులు పాలను విక్రయిస్తున్నా రు. ఈ నేపథ్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పాల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పించనుంది. అలాగే పత్తి, ఎర్ర మి రప, ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్స్‌, బల్క్‌ డ్రగ్స్‌, బ్రాస్‌ కాస్టిం గ్‌, కాంస్య శిల్పాలు, పోచంపల్లి ఇక్కత్‌కు జిల్లా ప్రసిద్ది కావడం తో సంబంధిత ఉత్పత్తులకు ప్రాచుర్యం, తగిన మార్కెట్‌ సౌక ర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్ట నుంది. తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు, దాతారుపల్లిలలో కూడా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అవస రమైన స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించే దిశగా జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉత్పత్తులు, ఉపాధికి గుమ్మంగా యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రా మిక వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనేక అనుమతుల ప్రక్రియను ఒకేచో ట, వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్‌ను తీసుకొచ్చింది. 24 గంటల నాణ్యమైన కరెంటు లభ్యత.. కావా ల్సినంత భూమి అందుబాటులో ఉండడం..పటిష్టమైన శాంతి భద్రతల వ్యవస్థ ఉండడం ఇందుకు ప్రధాన కారణాలు. దీనికి తోడు రాష్ట్ర రాజధానికి యాదాద్రి జిల్లా చేరువలో ఉండడం.. రింగ్‌ రోడ్డు సైతం సమీపంలోనే ఉండడంతో వివిధ రాష్ర్టాలకు రవాణా పరంగా ఇబ్బందులు లేకపోవడంతో ఐటీ, ఐటీ అను బంధం, ఇతర రంగాల పరిశ్రమలు పెద్ద ఎత్తున జిల్లాకు తరలివ స్తున్నాయి. ఏజీఐ సంస్థ భువనగిరిలో ఇప్పటికే బాటిళ్ల తయారీ పరిశ్రమను నడిపిస్తుండగా.. బీబీనగర్‌లో సిరామిక్‌ ఇండస్ట్రీని నిర్వహిస్తున్నది. భువనగిరిలో బాటిళ్ల తయారీని విస్తరించేందు కు సదరు సంస్థ సమాయత్తమవుతున్నది. హిందుస్థాన్‌ సానిటరీ ఇండస్ట్రియల్‌ లిమిటెడ్‌, ఎంఎస్‌ఎన్‌ కంపెనీ, ఆహార పదార్థాల తయారీకి సంబంధించి బాంబినో కంపెనీ, శ్రియం ల్యాబ్స్‌ వం టి ఎన్నో ప్రముఖ కంపెనీలు బీబీనగర్‌ ప్రాంతంలో ఇప్పటికే కొలువుదీరాయి. రాష్ట్రవ్యాప్తంగా మిషన్‌ భగీరథ పథకం నిర్వ హణ కోసం అవసరమైన పైపులను సరఫరా చేసిన జైన్‌ కంపెనీ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. చౌటుప్పల్‌ ప్రాంతంలో దివీస్‌, శ్రీని వంటి పెద్ద ఫార్మా కంపెనీలతో పాటు మరో 50 వరకు చిన్న చిన్న ఫార్మా కంపెనీలు కొనసాగుతున్నాయి. ఆత్మకూ రు(ఎం) మండలంలోని పోసానికుంట వద్ద కిచెన్‌కు సంబంధిం చిన వస్తువుల తయారీకి సంబంధించిన పరిశ్రమను ఏఎంఐ అనే సంస్థ ఏర్పాటు చేసింది.

మరింతగా పెరగనున్న ఉపాధి అవకాశాలు
జిల్లా వ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్ర మలు 1,024 వరకు ఉండగా.. వీటితో ప్రత్యక్షంగా 34వేల వర కు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ఇంతకు రెట్టింపుగానే ఉంటుంది. ఇందులో ఇతర రాష్ర్టాలకు చెందిన వారితో పాటు, స్థానిక యువత సైతం ఉంది. ఇక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుతో జిల్లాలో 20 వేలకు పైగా స్థానికులకే ఉపాధి అవకాశాలు కలిగి ఆదాయ పరంగా, ఉపాధి పరంగా లబ్ధి కలుగనుంది. పీఎంఎఫ్‌ఎంఈ పథకంలో భాగంగా జిల్లాలోని 403మహిళా సంఘాల సభ్యులకు రూ.40 చొప్పున ఆరంభంలో..ఆ తర్వాత రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణ సదుపాయం కల్పించి స్థానిక ఉత్పత్తులను విక్ర యించుకుని ఉపాధి పొందేలా గ్రామీణాభివృద్ది శాఖ ప్రణాళిక లు రూపొందించింది. సూక్ష్మ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పా టుతో గ్రామీణ ప్రాంత మహిళలు సైతం ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆహార ఉత్పత్తులకు అందలం

ట్రెండింగ్‌

Advertisement