హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చ డం బీజేపీకి అలవాటు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. కానీ, తెలంగాణలో మా ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ తరంకాదు. ఇక్కడ ఆ పార్టీ ఆటలు సాగవు’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ అధ్యక్షతన బషీరాబాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఉత్తమ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాము క్రికెట్ టీమ్ లా పటిష్టంగా ఉన్నామని తెలిపారు. ‘బీఆర్ఎస్ నుం చి ఎంతో మంది కాంగ్రెస్ లో చేరారు, ఎన్నికల తర్వా త ఏం జరుగుతుందో మీరే చూస్తారు’ అని చెప్పారు. రాష్ట్ర ఆదాయం, వనరులను పెంచుకోవడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, తనతో కలిపి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని చెప్పారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే ఇండియా కూడా పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియాలా తయారవుతుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చెప్పారు.