పాలమూరు చీడపురుగు డీకే అరుణ
‘పాలమూరును పట్టి పీడించిన చీడపురుగు డీకే అరుణ. కల్తీకల్లు, దొంగసారా అమ్ముకున్న, కంకర కొల్లగొట్టిన, కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దండుకున్న డీకే అరుణను మోదీ పక్కన కూర్చోబెట్టుకొని అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
- జనజాతర సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి
మక్తల్ టౌన్, మే 10 : ‘పాలమూరును పట్టి పీడించిన చీడపురుగు డీకే అరుణ. కల్తీకల్లు, దొంగసారా అమ్ముకున్న, కంకర కొల్లగొట్టిన, కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దండుకున్న డీకే అరుణను మోదీ పక్కన కూర్చోబెట్టుకొని అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధి కొత్తగార్లపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభల్లో రేవంత్ మాట్లాడుతూ గద్వా ల బంగ్లా రాజకీయాల నుంచి వచ్చిన డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని చెప్పారు. జడ్పీటీసీ మొదలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఆమె రాజకీయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ అనేక అవకాశాలు కల్పించిందని తెలిపారు. స్వలాభం కోసమే డీకే అరుణ బీజేపీలో చేరి పాలమూరు పార్లమెంట్ బరిలో నిలిచిందని, కాంగ్రెస్‌ను ఎదగనీయొద్దనే అక్కసుతో ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగిందని, దాన్ని తగ్గించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
వైఎస్ నిజమైన వారసురాలు షర్మిలే
హైదరాబాద్, మే 10 : మాజీ ముఖ్యమంత్రి వైస్ఎస్ రాజశేఖర్‌రెడ్డికి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలే అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకుపోతున్నందునే ఆమెకు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో శుక్రవారం నిర్వహించి న ‘మీట్ ది ప్రెస్’లో సీఎం మాట్లాడుతూ పార్టీ అదేశా ల మేరకే షర్మిల ఎన్నికల బరిలో నిలిచారని వివరించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లమీద మాట్లాడినందుకే మోదీ, అమిత్ షా టార్గెట్ చేసి క్రిమినల్ కేసు పెట్టించారని, 200మంది ఢిల్లీ పోలీసులను దింపారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

