సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 01, 2021 , 02:33:11

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగిఉండాలి

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగిఉండాలి

  • మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు

భువనగిరి అర్బన్‌, డిసెండర్‌ 31 : పరిసరాల పరిశుభ్రతపై పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నబోయిన ఆంజనేయులు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో గురువారం 2021 స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మున్సిపల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆర్పీలు, రిసోర్స్‌ పర్సన్లతో నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో తడి,పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలన్నారు. వ్యాపార సముదాయల నుంచి వచ్చిన చెత్తను రోడ్లపై వేయొద్దన్నారు. పట్టణాన్ని సుందరీకరణంగా ఉంచేందకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ప్రధాన వీధుల్లో, ఇంటి ఆవరణ, వార్డుల్లోని బహిరంగా ప్రాంతాల్లో చెత్త వేయరాదన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని, ఎవరైన వాడితే జరిమానా తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌రావు, మున్సిపల్‌ అధికారులు సాంబయ్య, ప్రసాద్‌రావు, రజిత, మోప్మా సిబ్బంది రమేశ్‌, కవిత, సువర్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo