భారత్ బంద్ సక్సెస్

- ప్రశాంతంగా బంద్
- వెల్లువెత్తిన నిరసనలు
- జాతీయ రహదారి దిగ్బంధం
- ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అరెస్టు
ఆలేరు టౌన్ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్లిందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా మంగళవారం ఆలేరు జాతీయ రహదారిపై పలు పార్టీల మద్దతుతో నిర్వహించిన రాస్తారోకోలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసేలా కొత్త చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులపై నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. అప్రజాస్వామికంగా చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం కొత్త చట్టాలను రైతులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అనంతరం పోలీసులు ప్రభుత్వవిప్ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాస్తారోకో సందర్భంగా జాతీయ రహదారిపై ఇరువైపున వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, నాయకులు వెంకటరాంరెడ్డి, మురళి, అనసూయ, వెంకట్‌రెడ్డి, కృష్ణ, ఎండీ ఫయాజ్, ఉప్పలయ్య, రామన్న, నర్సింహులు, జనార్దన్, వెంకటేశ్ పాల్గొన్నారు.
బంద్ ప్రశాంతం..
ఆలేరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చింది. దీంతో మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో పాటు మండలవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్మికులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, రైతులు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్, ఆటో కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. పట్టణంలో వ్యాపార సముదాయాలను మూయించారు. పలు ప్రాంతాల్లో దుకాణాదారులు తెరిచిఉండటంతో అఖిలపక్షం నాయకులు షాపులను మూయించారు. టీఆర్ఎస్కేవీ ఆటోయూనియన్ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. పాతగుండ్లపల్లి నుంచి స్వామివారి పాదాల మీదుగా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వవిప్ చేపట్టిన ధర్నా వద్దకు ఆటో ర్యాలీ కొనసాగింది.
మధ్యాహ్నం వరకు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సు..
భారత్ బంద్ నేపథ్యంలో యాదగిరిగుట్ట డిపో వద్ద వాతావరణం నిర్మానుష్యంగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డిపోలో 101 బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించలేదు. దీంతో యాదాద్రికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్‌బంద్ ప్రభావం యాదాద్రీశుడిపై పడటంతో పరిమితి సంఖ్యలోనే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ కాటంరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, కౌన్సిలర్లు మల్లేశం, అనిల్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, భరత్‌గౌడ్, యాదగిరి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం అయింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎల్హెచ్పీఎస్ల ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బూక్యా సుశీలా రవీందర్, జడ్పీ వైస్‌చైర్మన్ బీకునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, వివిధ పార్టీల మండలాల అధ్యక్షులు శంకర్‌నాయక్, జహంగీర్, దుర్గయ్య, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌నాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్‌కుమార్, కో-ఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రహమత్‌షరీఫ్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్యదవ్, టీఆర్ఎస్వీ, విభజన విభాగం మండలాల అధ్యక్షులు భాస్కర్‌యాదవ్, శంకర్‌నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దునాయక్, ఎంపీటీసీలు కరుణాకర్, మోహన్‌బాబు, నాయకులు శట్టయ్య, నరేందర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌గౌడ్, శ్రీను, విజయ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్‌బంద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మోత్కూరు-భువనగిరి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు ఉప్పలయ్య, లక్ష్మారెడ్డి, గోవర్ధన్, ముత్యాలు, ఇంద్రారెడ్డి, మల్లేశం, రాములు, భిక్షపతి, వెంకటేశ్, చందర్, కవిత, ధనలక్ష్మి, నగేశ్, నర్సింహారెడ్డి, దశరథ, తిర్మల్‌రెడ్డి, అరుణ, విజయ్, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుండాలలో..
గుండాల : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల నాయకులు బంద్ పాటించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.ఖలీల్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గడ్డమీది పాండరి మాట్లాడుతూ.. కేంద్రం తెస్తున్న కొత్త చట్టాలు రైతులను నష్ట పరిచే విధంగా ఉన్నాయని, తక్షణమే వాటిని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు శ్రీశైలం, నరేశ్, మహేశ్, సర్పంచులు సైదులు, అబ్బులు, బాషిరెడ్డి, రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భిక్షం, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దశరథ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, సీపీఎం మండల కార్యదర్శి రాజు, సీఐటీయూ మండల కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ నాయకులు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాములు, అంజిరెడ్డి, సోమిరెడ్డి, శేఖర్, రమేశ్, భిక్షం, నగేష్, ఉస్మాన్, సాయి, పరమేశ్, కాంగ్రెస్ నాయకులు రవి, వెంకటాద్రి, నారాయణ, వెంకన్న, రామచంద్రయ్య, యాదగిరి, కొండయ్య, యాదగిరి, ఎండీ సిరాజ్ పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన బంద్ మంగళవారం మండల కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకో నిర్వహించిన అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, సీసీ బ్యాంక్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మహేందర్‌గౌడ్, సీపీఐ మండల కార్యదర్శి లింగం, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణ, మండల నాయకులు సురేందర్‌రెడ్డి, ఉప్పలయ్య, సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు చేస్తున్న బంద్ మంగళవారం మండలంలో ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా రంగాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వామపక్షాల నాయకులు బస్‌స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధీర్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంరెడ్డి, స్వయంప్రభ, మల్లారెడ్డి, సురేందర్‌రెడ్డి, శంకర్, గోపాల్‌రెడ్డి, భరత్, మల్లేశ్, కాంగ్రెస్ నాయకులు మల్లేశ్, ఆగంరెడ్డి, శ్రీను, వెంకటేశ్‌గౌడ్, రాజు నాయక్, సీపీఎం నాయకులు ర్యాకల శ్రీశైలం, భిక్షపతి, పున్నమ్మ, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్‌లో..
ఆలేరు రూరల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్, అఖిలపక్ష పార్టీల నాయకులు రోడ్లపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్, వామపక్షాల నాయకులు అంజయ్య, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాంప్రసాద్, సోమయ్య, విఠల్‌గౌడ్, ప్రశాంత్, పాండు, వీరస్వామి, సోమన్న, బాలరాజు, రాజశేఖర్, ఎండీ ఇమ్రాన్, నాగరాజు, భాస్కర్, మహేందర్, బాలరాజు, నరేందర్, మహేశ్, రాజు, నాగరాజు, రమేశ్, మల్లయ్య తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- రైతులారా ఆశ కోల్పోవద్దు.. వంద నెలలైనా మీతో ఉంటాం: ప్రియాంక గాంధీ
- నిర్మాణ అద్భుతం దేవుని గుట్ట ఆలయం
- ఈ టీ తాగితే బరువు తగ్గొచ్చు
- జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
- మార్చి 12 నుంచి ప్రచారం మొదలుపెడుతా: మిథున్ చక్రవర్తి
- కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత