ఉప్పెన చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించింది కృతిశెట్టి. ఈ సినిమాతో వరుస ఆఫర్లు ఈ భామ ఖాతాలో వచ్చి పడ్డాయి. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు చాలా మందే ఉన్నారని తెలిసిందే. మెగాహీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఉప్పెనలో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. అయితే కృతిశెట్టి మరో మెగాహీరోతో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? సాయిధరమ్ తేజ్.
ఒకవేళ కృతిశెట్టి ఈ ఆఫర్ కు ఒకే చెప్తే అన్నదమ్ములతో కలిసి నటించిన హీరోయిన్ గా నిలిచిపోనుంది. సుకుమార్ ఈ సినిమాకు కథ నందిస్తుండగా..అతని దగ్గర పనిచేసిన కార్తీక్ దండు డైరెక్ట్ చేయనున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ ఇప్పటికే కృతిశెట్టికి కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి.
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?