e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News మెహ‌రీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!

మెహ‌రీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!

మెహ‌రీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!

టాలీవుడ్ న‌టి, పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌ మార్చిలో హ‌ర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత భ‌వ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది చివ‌రిలో వెడ్డింగ్ సెర్మనీని జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నారు మెహ‌రీన్‌-భ‌వ్య బిష్ణోయ్ క‌పుల్‌. అయితే కరోనా ఎఫెక్ట్ కార‌ణంగా వెడ్డింగ్ ప్లాన్ వాయిదా ప‌డ‌నుంద‌ని తెలిపింది మెహ‌రీన్‌. త‌న పెండ్లి వ‌చ్చే ఏడాదికి వాయిదా వేసుకుంటున్న‌ట్టు తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపింది. తాము ప్ర‌స్తుతానికి పెండ్లి గురించి ఏమి మాట్లాడ‌లేద‌ని, ప‌రిస్థితులు సాధార‌ణంగా మారే వ‌ర‌కు వెయిట్ చేస్తామ‌ని చెప్పింది.

నిశ్చితార్థం త‌ర్వాత మెహ‌రీన్‌తోపాటు ఆమె తల్లికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. దీంతో త‌ల్లీకూతుళ్లిద్ద‌రూ ముంబైలోని నివాసంలో ఐసోలేష‌న్ లో ఉన్నారు. మ‌రోవైపు ఢిల్లీలో భ‌వ్య బిష్ణోయ్ స‌హా అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. వాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతానికి ఇటు మెహ‌రీన్ అటు భ‌వ్య బిష్ణోయ్ కుటుంబ‌స‌భ్యులంతా సుర‌క్షితంగా ఉన్నారు.

ఇవికూడా చదవండి..

ఉప్పెన బ్యూటీ ఖాతాలో మ‌రో మెగా ఆఫ‌ర్..!

పూజాహెగ్డే అందం అద‌ర‌హో..స్టిల్స్ వైర‌ల్

కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే ర‌కుల్‌ యోగాస‌న్‌…!

బాల‌కృష్ణ నుంచి స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్?

ప‌వ‌న్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌..?

శ్రీదేవి చిన్న‌ కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెహ‌రీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!

ట్రెండింగ్‌

Advertisement