తుంగతుర్తి, జూన్ 05 : తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నల్లు నర్సింహారెడ్డి అమృతదేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమా జ్యోతి దంపతులు రూ.2.20.000 విలువ గల వాటర్ ప్లాంట్, అలాగే రూ.60 వేల వేల విలుగ గల శవ పేటిక (ఫ్రీజర్) గ్రామ ప్రజల అవసరార్ధం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నల్లు చిత్తరoజన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన ఊరి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలనే సంకల్పంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా గ్రామంలో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారికి సహాయంగా ఉంటుందని శవ పేట్టిక (ఫ్రీజర్) అందజేసినట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలగనుందన్నారు.
ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని సులభంగా పొందగలిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రామ ప్రజలందరూ నల్లు చిత్తరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లు కవిత రెడ్డి, నల్లు అరుణ రెడ్డి, భారతి రెడ్డి, సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్, ఉప సర్పంచ్ యనగందుల లావణ్య, మధుసూదన్, మాజీ సర్పంచ్ నల్లు రాంచద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్, గుండగాని దుర్గయ్య, సూర్యప్రకాష్, వీరన్న, పోలేపాక సోమయ్య, వీరమల్లు రవి, మల్లయ్య, పులి ముత్తయ్య, యనగందుల రామచంద్రు, సత్తమ్మ, జక్కుల లింగయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.