Niranjan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్దాలు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు ( Irrigation Projects ) లపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు ( Irrigation Projects ) లపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు.
ఒక టీఎంసీకి 15 వేల ఎకరాల పంట సాగు అని కేంద్ర జలసంఘం సమావేశాల్లో చెప్పడం వల్ల పరువు పోవడమే కాకుండా, టీఎంసీకి 15 వేల ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అబద్దాల లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘటన కేసీఆర్‌దే
కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా ? ఈ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ? అంటు ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వల టెండర్లు రద్దు చేయడం వల్ల ఇప్పుడు రూ.4 వేల కోట్ల భారం పెరిగిందని విమర్శించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు.
ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టు పనులేనని వెల్లడించారు. 2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఎల్ఐ ఎత్తిపోతల పనులను 2016 లో బీఆర్ఎస్ పూర్తి చేసిందని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించారని తెలిపారు. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు కాగా భూసేకరణ అసలే చేయలేదని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.
అబద్ధానికి అంగీ, లాగు వేస్తే..
పాలమూరు బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి 30 నెలల్లో ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారని, తాము ఏ ప్రాజెక్టులను అడ్డుకున్నామని నిలదీశారు. అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్ రెడ్డిని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజుల పర్యటన జరిపి అబద్దాలు వల్లించడం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ లోనే ఇదే స్క్రిప్టు చదివితే ప్రజలకు కొంచెం భారమైనా తగ్గేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

