సూరత్: ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ గుజరాత్లో పర్యటిస్తున్నారు. సూరత్‌లో ఉన్న ఎల్ అండ్ టీకి చెందిన ఆర్మ్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్‌ను ఆయన విజిట్ చేశారు. అక్కడ ఆయన రక్షణరంగ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. సూరత్ ఎల్ అండ్ టీలో అత్యాధునిక రక్షణరంగ పరికరాలను తయారు అవుతున్నాయి. వాటి గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఈ పర్యటన చేపట్టారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఓ మొక్కను నాటారు. పర్యావరణ సంరక్షణ, సుస్థిర అభివృద్ధి సందేశాన్ని ఇచ్చారు. కంపెనీలో జరుగుతున్న దేశీయ రక్షణ వ్యవస్థ ఉత్పత్తుల గురించి ఎల్ అండ్ టీ అధికారులు మోదీకి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా సూరత్ ఎల్ అండ్ టీలో అనేక రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. హెవీ ఇంజినీరింగ్, ఆర్మర్డ్ సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. ఈ సెంటర్లోనే అయిదో జనరేషన్‌కు చెందిన అడ్వాన్సడ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డెవలప్ చేయనున్నారు.