Rekonda | చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రేకొండ (Rekonda) గ్రామంలో రేకొండ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు గోపగోని రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి పొదుపు సంఘం నుంచి బోనస్ పొదుపులు, సామూహిక నిధి క్లైమ్, అభయ నిధి కింద మొత్తం రూ. 99 వేలకు పైగా నగదు సమకూర్చారు. ఈ నగదును సైదాపూర్ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్, రేకొండ పొదుపు సంఘం అధ్యక్షుడు చెంచల దిలీప్ రమేశ్ భార్య రజితకు బుధవారం (Wednesday) అందజేశారు.
రమేశ్ సంఘ సభ్యులుగా కొనసాగుతున్నారని అతనికి రావలసిన పొదుపులతో పాటు సంఘం ద్వారా సామూహిక నిధి ఇచ్చామని వారు తెలిపారు. వీరి వెంట సభ్యులు కట్కోజుల రవీంద్రాచారి, పీరల్ల తిరుపతి, పోగుల రవీందర్, పీరల్ల వేణు, చెంచల భూమేశ్, కనకం రఘు, చెంచల వెంకటస్వామి, చెంచల సురేశ్, సమితి గణకుడు అనగోని వీరన్న, సంఘ ఘనకుడు బేరి హరీశ్ ఉన్నారు.