తుంగతుర్తి, ఆగస్టు 12 : తుంగతుర్తి మండలం బండరామారంలో ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆధ్వర్యంలో బుధవారం వారి తల్లిదండ్రులు తాటికొండ రాఘవయ్య, అనసూయమ్మ జ్ఞాపకార్థం ప్లేట్లు, గ్లాసులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్‌కు పాఠశాల నుండి పునాదులు ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండ రామారం గ్రామ సర్పంచ్ కోరుకొప్పుల నరేశ్, హెచ్ఎంలు ఆకారపు రవి, బాబు, ఉపాధ్యాయులు కృష్ణ, నవీన, ఉమారాణి, గ్రామస్థులు కొల్లూరి మహేందర్, భాస్కర్, రవి, రామకృష్ణ, వెంకన్న పాల్గొన్నారు.