సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jun 14, 2020 , 03:03:02

‘యాదాద్రి నిర్మాణాల నాణ్యతలో రాజీలేదు’

‘యాదాద్రి నిర్మాణాల నాణ్యతలో రాజీలేదు’

యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి ప్రధానాలయ నిర్మాణం పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, వెయ్యేళ్లకాలపరిమితితో నిర్మిస్తున్నామని వైటీడీఏ టెక్నికల్‌ కమిటీ సభ్యుడు కొండల్‌రావు, ఆలయ ఈఓ ఎన్‌. గీత స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వైటీడీఏ టెక్నికల్‌ కమిటీ బృదం సభ్యులు ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం మొదలైన నేపథ్యంలో లీకేజీలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధానాలయం పనులు ఇంకా పూర్తి కాలేదని.. అప్పుడే అంతా అయిపోయింది.. ఏదో జరిగిపోతుందనే ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇంకా నిర్మాణంలో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఉన్నదన్నారు.  పురాతన పద్ధతిలో సిమెంటు వాడకుండా వెయ్యేళ్ల కాలపరిమితితో పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనుల నాణ్యత పరిశీలనకు పురావస్తు శాఖ నిపుణులు సోమవారం రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్కిటెక్టు ఆనందసాయి, ఇంజినీర్‌ మధుసూదన్‌, వైటీడీఏ స్తపతి డాక్టర్‌ ఆనందాచార్యుల వేలు తదితరులు ఉన్నారు.

VIDEOS

logo