భువనగిరి..జనసంద్రం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భువనగిరి పట్టణం జనసంద్రమైంది. రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి.
- గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన కేసీఆర్
- రోడ్‌షోకు భారీగా హాజరైన జనం, పార్టీ కార్యకర్తలు
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భువనగిరి పట్టణం జనసంద్రమైంది. రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. కేసీఆర్‌ను చూడగానే ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీశారు. మధ్యాహ్నం నుంచే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా భువనగిరికి చేరుకున్నారు. సాయంత్రం భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సులో భువనగిరికి చేరుకోగానే దారి పొడవునా పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ నూతనోత్తేజాన్ని నింపారు. కేసీఆర్ బస్సు వెంట వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలు ర్యాలీగా ముందుకు సాగారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం
భువనగిరి పట్టణంలో నిర్వహించిన కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్‌షో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. నియోజకవర్గం నుంచి ప్రజలు ముఖ్యంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం పార్టీ శ్రేణుల ఉత్సాహం రెట్టింపైంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

