Konda Surekha | ఖిలా వరంగల్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై విచారణ జరిపి అనర్హులపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం శివనగర్‌లోని ఓ కన్వెన్షన్ హాలులో తూర్పు నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రూ.5,30,61,480, సీఎం రిలీఫ్ ఫండ్ రూ.35,37,700 విలువ కలిగిన చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. అలాగే త్వరలోనే వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం సముదాయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, చింతాలకు అనిల్, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, నాయకులు పగడాల సతీష్, శ్రీరాం రాజేష్, చకినాల రజని, మంద అక్షిత్ పటేల్, బత్తుల నవీన్, యుగేందర్‌గౌడ్, రేణుకుంట్ల శివ, ఎండీ చాంద్‌పాషా, డీఆర్వో విజయలక్ష్మి, ఖిలావరంగల్, వరంగల్ తహసీల్ధార్లు ఎండీ ఇక్బాల్, టీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య