Konda Surekha | వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సభలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే తమ సమస్యలు వినకుండానే వెళ్లిపోవడంతో డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ మా సమస్యలు వినకుండానే వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు.
డివిజన్‌కు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. మేడమ్ వచ్చింది.. వెళ్లిపోయింది.. మేమెవరికి చెప్పుకోవాలే.. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి.. గల్లీకొచ్చి చూస్తే మా బాధలు ఏంటో తెలుస్తయి. మమ్మల్ని చూడరు.. మా గల్లీకి రారు..మా ఇంట్ల తిందామంటే తిండికి కూడా లేదు. మమ్మల్ని పట్టించుకోరు ఎవరూ.. ఏమన్నా మాట్లాడితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటరు.. ఇది మా పరిస్థితి. డబుల్ బెడ్ రూంలు అన్నరు.. హౌసింగ్ లోన్లు అన్నరు.. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అక్కడ కంప్లైయింట్ కూడా చేసినం.. ఎవరు పట్టించుకోవడం లేదంటూ వాపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మంత్రి కొండా సురేఖ మా సమస్యలు వినకుండానే వెళ్లిపోయింది
వరంగల్ జిల్లా GWMC 12వ డివిజన్ పరిధిలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
సమస్యలు వినకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డివిజన్ ప్రజలు pic.twitter.com/hG5Qy55oSP
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2026
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత