TSUTF | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 26 : మోడల్ స్కూల్స్టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మోడల్ స్కూల్స్టీచర్స్సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశం హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్ సమావేశ మందిరంలో ఎస్ విట్టల్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ మెంబర్స్ బిరిగెల కొండయ్య, అరవింద్ ఘోష్, చింత శివప్రసాద్, సిలివేరి మహేష్, బత్తిని సత్యనారాయణ గౌడ్, ఆరిఫ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మోడల్ స్కూల్స్‌ను ఆంధ్రప్రదేశ్‌లో లాగా విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్యనియామకాలు చేపట్టాలని, నోషనల్ సర్వీస్ ఇవ్వాలని హిందీ పీజీటీ పోస్ట్‌ను మంజూరు చేయాలన్నారు. ఇంక్రిమెంట్ ఇవ్వాలని, స్పాట్ వాల్యుయేషన్‌లో సీఎస్, డీవో, సీఈ, ఎస్ఈలుగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, ప్రిన్సిపాల్స్‌కు ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జీ రాజశ్రీ, శశికుమారి, సంధ్య, హైమావతి, రుద్రమదేవి, నీలాద్రి, డి బాలకిషన్, కిరణ్, శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్, విశ్వనాథ్, సరోజ, సుధాకర్‌రెడ్డి, వెంకన్న, వేణుగోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, నారా శ్రీనివాస్, మోహన్‌రావు, మోడల్ స్కూల్స్ టీచర్లు పాల్గొన్నారు.
Read Also :
Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్