న్యూఢిల్లీ: హొర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన 2ఎల్పీజీ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. భారత్కు చెందిన ఇంధన నౌకలు హొర్ముజ్ జలసంధి మీదుగా సురక్షితంగా పయనించేందుకు రెండు మూడు గంటల్లో అనుమతి లభించనున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి సూచనలు అందచేసిన కొన్ని గంటల్లోనే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.