Thousand Piller Temple | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18 : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం ఉత్తిష్ఠగణపతి ఆరాధన, రుద్రేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకం నిర్వర్తించి దేవాలయ ఆవరణలో రుద్రేశ్వరీ-రుద్రేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై రుద్రేశ్వరీ-రుద్రేశ్వరులను ప్రతిష్ఠించి స్వస్తివాచకం, కలశస్థాపన, అంకురారోపణ, రుత్విక్కరణ, కంకణపూజ, బాసికపూజ, నూతన యజ్ఞోపవిత్రధారణ, జిలకర బెల్లం మహాసంకల్పమంత్రపఠనంతో ఆది దంపతుల వర, ప్రవరలతో శివసంకల్పం చెప్పి పాద ప్రక్షాళన నిర్వహించారు.
మాంగళ్యధారణ, అక్షతారోహణ, తలంబ్రాలు, చూర్ణికామంత్రములతో, బ్రహ్మముడులు, పుష్పార్చనలు, నీరాజన మంత్రపుష్పాలు వైదిక కార్యక్రమాలను టీటీడీ వేదపాఠశాల అధ్యాపకులు, కోమాళ్లపెల్లి సంపత్‌కుమార్‌శర్మ వైదిక కార్యక్రమాలను శాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. ప్రముఖ శివభక్తుడు గుజ్జా సంపత్‌రావు-సౌమ్య దంపతుల సౌజన్యంతో కళ్యాణోత్సవం జరిపించి వేలాది మంది భక్తులు నంది వాహనంపై స్వామివార్లను వాహనసేవ నిర్వర్తించారు.
‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ..
ఆలయ ఎదుట కుడా గార్డెన్స్‌లో 11001 ఘటాలకు పూజలు నిర్వహించిన అనంతరం కొండా శ్రీనివాస్, సీహెచ్.శ్రీకాంత్‌స్వామి అయ్యప్పస్వాముల ఆధ్వర్యంలో పదకొండు వందలమంది అయ్యప్పస్వాముల శరణుగోషతో ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప భజనలు నిర్వర్తిస్తూ రుద్రేశ్వరి-రుద్రేశ్వర స్వామి వార్లను స్మరిస్తూ శోభయాత్ర నిర్వహించారు. గట్ల కానపర్తికి చెందిన భజనమండలి సభ్యులు సుమారు 50 మంది ఆధ్యాత్మిక కళాకారులు, భక్తులను మైమరిపించేవిధంగా భజనలు, కోలాటాలు నిర్వహించారు.
ఆలయ నిర్వాహణాధికారి డి అనిల్‌కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్‌శర్మ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఎన్.మధుకర్, రామకృష్ణ, రజిత భక్తులకు సేవలందించారు. 19న అమావాస్య సందర్భంగా రుద్రేశ్వరునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు గ్రహపీడలు తొలిగిపోవాలని ప్రత్యేక అభిషేకాలు చేయడం జరుగుతుందని, సాయంత్రం ప్రాచీన కోనేరులో కార్తీకమాసం సమాప్తం సందర్భంగా దీపాలు వదిలిపెట్టడం జరుగుతుందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
కుడా గార్డెన్లో 11001 ఘటాలకు పూజలు
ఆలయ ఎదుట కుడా గార్డెన్స్‌లో 11001 ఘటాలకు పూజలు నిర్వర్తించిన అనంతరం కొండా శ్రీనివాస్, సీహెచ్.శ్రీకాంత్‌స్వామి అయ్యప్పస్వాముల ఆధ్వర్యంలో పదకొండు వందలమంది అయ్యప్పస్వాముల శరణుగోషతో ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప భజనలు నిర్వర్తిస్తూ రుద్రేశ్వరి-రుద్రేశ్వరస్వామివార్లను స్మరిస్తూ శోభయాత్ర నిర్వహించారు.

Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి